- Telugu News Photo Gallery Cricket photos India Vs South Africa 1st Test Team India 5th Place In World Test Championship Points Table in Telugu
IND vs SA 1st Test: రోహిత్ కెరీర్‌కే మచ్చ తెచ్చిన ఓటమి.. బంగ్లాదేశ్ కంటే దిగజారిపోయిందిగా..
WTC Points Table: ఈ ఒక్క విజయం దక్షిణాఫ్రికాకు భారీ ప్రయోజనంగా మారింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో సౌతాఫ్రికా జట్టు ఏడో స్థానం నుంచి నేరుగా మొదటి స్థానానికి ఎగబాకింది. ఇక ఈ ఘోర పరాజయంతో భారత్ పరిస్థితి ఒక్కసారిగా పడిపోయింది. టీమ్ ఇండియా మొదటి స్థానం నుంచి నేరుగా ఐదో స్థానానికి పడిపోయింది.
Updated on: Dec 29, 2023 | 10:41 AM

భారత్‌తో జరుగుతోన్న రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా స్వల్ప మొత్తానికి ఆలౌటయి ఘోర పరాజయాన్ని చవిచూసింది. విరాట్ కోహ్లీ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేకపోయారు.

దీంతో మూడో రోజు భారత్ ఓటమితో మ్యాచ్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్‌లు రెండో ఇన్నింగ్స్‌లోనూ ఔటయ్యారు. దీంతో భారత్‌పై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ ఒక్క విజయం దక్షిణాఫ్రికాకు భారీ ప్రయోజనంగా మారింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో సౌతాఫ్రికా జట్టు ఏడో స్థానం నుంచి నేరుగా మొదటి స్థానానికి ఎగబాకింది. ఇక ఈ ఘోర పరాజయంతో భారత్ పరిస్థితి ఒక్కసారిగా పడిపోయింది. టీమ్ ఇండియా మొదటి స్థానం నుంచి నేరుగా ఐదో స్థానానికి పడిపోయింది.

ఇప్పుడు, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో ఉండాలంటే టీమ్ ఇండియా మరెవరికీ లేని విధంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. సిరీస్ బ్యాలెన్సింగ్ కూడా ఒక సవాలుగా మారింది. ఆశ్చర్యకరంగా పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ జట్టు కంటే భారత జట్టు మరింత దిగువన ఉంది. బంగ్లాదేశ్ మూడో స్థానంలో నిలిచింది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో దక్షిణాఫ్రికా 100 శాతం విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ ఫలితాల్లో పాకిస్థాన్ రెండో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి.

భారత్ గెలుపు శాతం 67 నుంచి 44.44కి పడిపోయింది. తద్వారా ఐదో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా 41.67 శాతంతో ఆరో స్థానంలో, వెస్టిండీస్ 16.67 శాతంతో ఏడో స్థానంలో, ఇంగ్లండ్ 15 శాతంతో ఎనిమిదో స్థానంలో ఉన్నాయి.

తొలి టెస్టులో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 245 పరుగులకు ఆలౌటైంది. ప్రతిగా దక్షిణాఫ్రికా 408 పరుగులు చేసి 163 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 131 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ సేన 32 పరుగుల తేడాతో ఇన్నింగ్స్ క్షటమిని చవి చూసింది.




