Ind vs Eng: చివరి టెస్ట్ రద్దుతో ఇంగ్లీష్ మీడియా ఓవర్ యాక్షన్.. భారత్‌ను టార్గెట్ చేస్తూ కథనాలు..!

|

Sep 11, 2021 | 8:50 AM

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీంల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరగాల్సి ఉంది. కానీ, కరోనా నేపథ్యంలో ఈ చివరి టెస్ట్ మ్యాచ్ రద్దైంది.

1 / 5
కరోనా కారణంగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీంల మధ్య ఐదవ మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. దీని తర్వాత సిరీస్ ఫలితానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదే సమయంలో, ఇంగ్లండ్ మీడియా భారతదేశాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఈ మొత్తం వివాదం ఆగస్టు 31 నుంచి మొదలైందని పేర్కొంది.

2 / 5
గత వారం, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ,  జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి లండన్‌లో జరిగిన పుస్తకావిష్కరణకు హాజరయ్యారు. ఈ పుస్తకాన్ని శాస్త్రి స్వయంగా రాశారు. ఈ ఇద్దరితో పాటు, కోచింగ్ సిబ్బందిలోని మరికొందరు సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

3 / 5
సెప్టెంబర్ 5 న, శాస్త్రికి కరోనా లక్షణాలు కనిపించడంతో యాంటిజెన్ పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలింది. మరుసటి రోజు RT-PCR పరీక్షను నిర్వహించగా, అందులోనూ పాజిటివ్ అని తేలింది. జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లు కూడా పాజిటివ్‌గా తేలారు. ప్రస్తుతం వీరంతా ఐసోలేషన్‌లో ఉన్నారు. సెప్టెంబరు 7 న శాస్త్రి, కోహ్లీ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్లడంతో బిసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వారిద్దరి నుంచి బోర్డు వివరణ కోరినట్లు తెలిసింది.

4 / 5
సెప్టెంబర్ 9 న, టీమిండియా సహాయక సిబ్బందిలోని మరొక సభ్యుడు - అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్ యోగేష్ పర్మార్ కోవిడ్ -19 పాజిటివ్‌గా గుర్తించారు. దీని తర్వాత రెండు జట్ల క్రికెట్ బోర్డుల సమావేశం జరిగింది. భారత జట్టు ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేశారు. అందరికీ నెగిటివ్ వచ్చింది. కానీ, ప్రాక్టీస్ సెషన్ రద్దు చేయడంతో హోటల్ గదులకే పరిమితం అయ్యారు.

5 / 5
అంతకుముందు సెప్టెంబర్ 10న ఉదయం, మ్యాచ్ మొదటి రోజు ఆటను రద్దు చేసే అవకాశాలు ఉన్నాయనే నివేదికలు వెలువడ్డాయి. అనంతరం మధ్యాహ్నానికి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు రెండు బోర్డులు ప్రకటించాయి.