IND vs SL Test: రీఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. దూరమైన ముగ్గురు.. లంకతో తలపడే భారత జట్టు ఇదే..?

Updated on: Jul 27, 2026 | 7:31 PM

IND vs SL Test: శ్రీలంకతో జరగనున్న కీలకమైన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించడానికి బీసీసీఐ సిద్ధంగా ఉంది. ఈ అధికారిక ప్రకటన జులై 28, మంగళవారం నాడు వెలువడే అవకాశం ఉంది. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పరంగా అత్యంత కీలకమైన ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ప్రధాన మార్పులు ఉండనున్నాయి.

1 / 6
IND vs SL Test: శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఎంపిక ప్రక్రియ వేగవంతం కావడంతో, అభిమానులలో చాలా ఉత్సుకత నెలకొంది. ఈ సిరీస్‌కు ముగ్గురు ఆటగాళ్లను పక్కన పెట్టనుండగా, మరో ఇద్దరు ఆటగాళ్లు జట్టులో ఖాయంగా ఉన్నారు. ఆ ఆటగాళ్లు ఎవరు..?

2 / 6
జస్ప్రీత్ బుమ్రా: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎడమ మోకాలి గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఆగస్టు 15 నాటికి పూర్తిగా ఫిట్‌గా ఉండే అవకాశం ఉంది. అందువల్ల, శ్రీలంక సిరీస్‌కు బుమ్రాను ఎంపిక చేయాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం.

3 / 6
రవీంద్ర జడేజా: గాయం కారణంగా మే నెల నుంచి ఆటకు దూరమైన స్టార్ ఆల్-రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పుడు పూర్తిగా కోలుకుని జట్టులోకి తిరిగి రానున్నాడు. శ్రీలంకలోని స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లపై జడేజా రాక భారత్‌కు పెద్ద బలాన్ని చేకూరుస్తుంది.

4 / 6
హర్షిత్ రాణా: ఇంగ్లాండ్ పర్యటనలో తీవ్రమైన కండరాల గాయానికి గురైన టీమ్ ఇండియా పేసర్ హర్షిత్ రాణా, శ్రీలంకతో జరిగే మొత్తం టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో మరో పేసర్‌కు అవకాశం లభించే అవకాశం ఉంది.

5 / 6
నితీష్ కుమార్ రెడ్డి: యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా తొడ కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకోనందున ఎంపికకు అందుబాటులో లేడని బీసీసీఐ వర్గాలు ధృవీకరించాయి. అందువల్ల, నితీష్ రెడ్డి శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌లో కూడా ఆడడు.

6 / 6
వాషింగ్టన్ సుందర్: ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా కాలికి గాయమైన వాషింగ్టన్ సుందర్, ఆగస్టు 15న ప్రారంభమయ్యే తొలి టెస్టు మ్యాచ్‌కు అధికారికంగా దూరమయ్యాడు. అయితే, అతడిని రెండో టెస్టు మ్యాచ్‌కు ఎంపిక చేస్తారో లేదో వేచి చూడాలి.

Follow Us