టీం ఇండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టు క్రికెట్‌లో నిలకడగా రాణిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాడు. భారత్ తరఫున అత్యంత వేగంగా 100 టెస్టు వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ బుమ్రా.. ప్రస్తుతం మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
జస్ప్రీత్ బుమ్రా విదేశీ గడ్డపై 100 టెస్టు వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఈ ఫాస్ట్ బౌలర్ కేవలం 43 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డును తాకాడు. సెంచూరియన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రాసి వాన్ డెర్ డస్సెన్‌ను బౌల్డ్ చేయడం ద్వారా అతను తన 100వ వికెట్‌ని అందుకున్నాడు.
విశేషమేమిటంటే, 4 సంవత్సరాల క్రితం జనవరి 2018లో, బుమ్రా తన టెస్ట్ కెరీర్‌ను దక్షిణాఫ్రికాలో ప్రారంభించాడు. అప్పటి నుంచి 25 టెస్టులు ఆడాడు. ఇప్పటి వరకు బుమ్రా 23 మ్యాచులు విదేశాలలో ఆడాడు.
టెస్టుల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రానే. కేవలం 24 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు. బుమ్రా తన కెరీర్‌లో ఇప్పటివరకు 25 టెస్టులు ఆడగా, అందులో 105 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక ఇన్నింగ్స్‌లో 6 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు.