IND vs PAK Womens Asia Cup Final: క్రికెట్ పిచ్‌పై మరోసారి అతిపెద్ద పోరుకు రంగం సిద్ధమైంది. భారత్-పాకిస్థాన్ మళ్లీ ఢీకొనవచ్చు. టీమిండియా శ్రీలంక టూర్‌లో ఉంది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందని మీరు ఆలోచిస్తున్నారా..? అక్కడికే వస్తున్నాం.. అసలు మ్యాటర్‌కి వస్తే.. సమీకరణలు చూస్తుంటే, శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ఆసియాకప్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఈ పోరు ఫైనల్‌లో చూడొచ్చు. అంటే, ప్రస్తుతం భారత క్రికెట్ పురుషుల జట్టు ఉన్న దేశంలోనే ఇది జరగడం గమనార్హం. ఆసియాకప్‌లో భారత్, పాకిస్థాన్ మహిళల జట్లు ఫైనల్‌లో తలపడితే.. 216 గంటల్లో ఈ రెండు జట్ల మధ్య ఇది రెండో పోరుగా మారనుంది.
శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జులై 19న తొలి పోరు జరిగింది. టోర్నీలో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. మహిళల ఆసియా కప్‌లో భారత మహిళల జట్టు పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి విజయంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు అన్నీ ముగిసిన తర్వాత, ఇప్పుడు మహిళల ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు సెమీఫైనల్‌లోకి ప్రవేశించాయి.
జులై 26న సెమీ ఫైనల్ మ్యాచ్. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు తొలి సెమీఫైనల్ ఆడనుంది. కాగా నిదా దార్ నేతృత్వంలోని పాక్ జట్టు రెండో సెమీఫైనల్‌లో తలపడనుంది. సెమీఫైనల్‌లో వీరిద్దరికి ప్రత్యర్థి ఎవరనేది గ్రూప్ బి చివరి లీగ్ మ్యాచ్ ఫలితం తర్వాత తేలనుంది. అయితే, రివర్సల్ లేకపోతే, భారత జట్టు సెమీ-ఫైనల్ బంగ్లాదేశ్‌తో ఆడే అవకాశం ఎక్కువగా ఉంది. పాకిస్తాన్ జట్టు శ్రీలంకతో ఆడవచ్చు.
ఇప్పుడు భారత్, పాకిస్థాన్ మహిళల జట్లు తమ తమ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లను గెలిస్తే, జులై 28న జరిగే ఫైనల్‌లో వారి మధ్య మరో భీకర పోరు చూడొచ్చు. ఇదే జరిగితే 216 గంటల్లో భారత్-పాకిస్థాన్‌లు రెండోసారి తలపడే అవకాశం ఉంది. ఇక్కడ 216 గంటలు అంటే జులై 19, జులై 28 మధ్య తేడా అన్నమాట. భారత్ ఇప్పటివరకు 8 సార్లు మహిళల ఆసియా కప్‌ను గెలుచుకుంది. ఈ విషయంలో పాకిస్థాన్ ఖాతా తెరవలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..