IND vs PAK: 25 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన కింగ్ కోహ్లీ.. టీం ఇండియా నంబర్ 1 ఫీల్డర్‌గా..

Updated on: Feb 23, 2025 | 6:49 PM

Pakistan vs India, 5th Match, Group A: ప్రస్తుతం విరాట్ కోహ్లీ బ్యాట్‌తో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోతున్నాడు. బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురిపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ, వరుసగా విఫలమవుతూనే ఉన్నాడు. అయితే, ఫీల్డింగ్‌లో మాత్రం ఓ స్పెషల్ రికార్డ్ నెలకొల్పాడు. అదేంటో ఓసారి చూద్దాం..

1 / 5
Virat Kohli Takes 157th Catch: ప్రతి భారత అభిమాని టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి పరుగులు ఆశిస్తున్నారు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులు సృష్టించిన విరాట్, ఈ మధ్య బ్యాటింగ్‌లో ప్రత్యేకంగా ఏమీ చేయడం లేదు. కానీ, ఏదో ఒక రికార్డు సృష్టిస్తూనే ఉన్నాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా కోహ్లీ తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని చూపించే ముందు రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత క్రికెటర్‌గా ప్రత్యేక రికార్డు సృష్టించాడు.

2 / 5
దుబాయ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీం ఇండియా ముందుగా బౌలింగ్ చేసి పాకిస్థాన్‌ను 241 పరుగులకు ఆలౌట్ చేసింది. ఈ సమయంలో విరాట్ కోహ్లీ రెండు క్యాచ్‌లు పట్టడం ద్వారా పాకిస్తాన్‌ను ఆలౌట్ చేయడంలో కూడా దోహదపడ్డాడు. ఈ మొదటి క్యాచ్‌తో, అతను భారతదేశంలో అత్యంత విజయవంతమైన ఫీల్డర్ అయ్యాడు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ 47వ ఓవర్లో, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో విరాట్ లాంగ్ ఆన్‌లో నసీమ్ షా క్యాచ్ పట్టి, వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత ఫీల్డర్‌గా నిలిచాడు.

3 / 5
299వ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ.. 157వ క్యాచ్ పట్టాడు. దీంతో అతను మాజీ కెప్టెన్, లెజెండరీ ఫీల్డర్ మహ్మద్ అజారుద్దీన్ (156) రికార్డును బద్దలు కొట్టాడు. అజారుద్దీన్ తన చివరి క్యాచ్‌ను దాదాపు 25 సంవత్సరాల క్రితం మే 2000లో ఆడాడు. అప్పటి నుంచి ఏ భారతీయ ఫీల్డర్ కూడా అతని దరిదాపులకు కూడా రాలేకపోయాడు.

4 / 5
కానీ, ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత, కోహ్లీ ఈ రికార్డును తన పేరిట సృష్టించాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ఇప్పుడు మూడో స్థానానికి చేరుకున్నాడు.

5 / 5
వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే పేరిట ఉంది. అతను 218 క్యాచ్‌లు పట్టాడు. రెండవ స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు. అతని పేరు మీద 160 క్యాచ్‌లు ఉన్నాయి.