IND vs PAK: ఇదేందయ్యా షమీ.. వన్డేలో ఇదెక్కడి చెత్త రికార్డ్.. జహీర్‌, ఇర్ఫాన్ లిస్ట్‌లో ఎంట్రీ

Updated on: Feb 23, 2025 | 3:25 PM

Mohammed Shami bowls the joint-longest over by an Indian in ODIs: పాకిస్తాన్ తరపున బాబర్ అజామ్‌తో కలిసి ఇమామ్ ఉల్ హక్ ఓపెనర్‌గా దిగాడు. గాయపడిన ఫఖర్ జమాన్ స్థానంలో ఇమామ్ వచ్చాడు. ఇక్కడ, రోహిత్ శర్మ మొదటి ఓవర్‌ను మహ్మద్ షమీకి అప్పగించాడు. మొదటి ఓవర్లో మహ్మద్ షమీ 5 వైడ్ బాల్స్ వేశాడు. దీంతో ఓ చెత్త రికార్డ్ నమోదు చేశాడు.

1 / 5
ఆదివారం దుబాయ్‌లో జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే, తొలి ఓవర్‌లోనే టీమిండియా స్టార పేసర్ విసుగెత్తించాడు. దీంతో ఓ చెత్త రికార్డును తన పేరుతో లిఖించుకున్నాడు. వన్డే ఇంటర్నేషనల్స్‌లో భారత బౌలర్ మహమ్మద్ షమీ అత్యధిక ఓవర్ వేసిన అవాంఛిత రికార్డును నమోదు చేశాడు.

2 / 5
కొత్త బంతితో బౌలింగ్ చేస్తూ, షమీ 11 బంతుల ఓవర్ వేసి  ఆరు పరుగులు ఇచ్చాడు. వాటిలో ఐదు వైడ్ల నుంచి వచ్చాయి. అతను తన స్వింగ్‌ను నియంత్రించడానికి, తన లైన్‌ను నిలబెట్టుకోవడానికి ఇబ్బంది పడ్డాడు.

3 / 5
జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ తర్వాత వన్డేల్లో 11 బంతుల ఓవర్ వేసిన మూడవ భారతీయుడిగా అతను నిలిచాడు. జహీర్ ఆరు సందర్భాలలో 10 బంతుల ఓవర్లు బౌలింగ్ చేశాడు.

4 / 5
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో షమీ వేసిన ఓవర్ మూడోది. బంగ్లాదేశ్‌కు చెందిన హసిబుల్ హొస్సేన్,  జింబాబ్వేకు చెందిన తినాషే పన్యాంగర ఈ పోటీలో అత్యధిక ఓవర్లు వేసిన రికార్డును కలిగి ఉన్నారు.  ఒక్కొక్కరు 13 బంతులతో ఓవర్లు వేశారు.

5 / 5
ప్రస్తుతం వార్త రాసే వరకు పాకిస్తాన్ జట్టు 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది. బాబర్ ఆజం 23, ఇమామ్ 10 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. అయితే, షమీ బౌలింగ్ చేసుకుందు ఇబ్బంది పడడంతో తన మూడో ఓవర్ ముగిశాక, పెవలియన్ చేరాడు.