- Telugu News Photo Gallery Cricket photos IND Vs NED, ICC World Cup 2023 Indias Top Five Players Have Scored 50 Plus Runs In An Innings in Telugu
ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా సరికొత్త చరిత్ర.. రికార్డులు తిరగరాసిన ఐదుగురు ప్లేయర్స్..
IND vs NED, ICC World Cup 2023: వన్డే ప్రపంచ కప్ 2023 లీగ్ దశ చివరి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా 9 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, తమ రికార్డ్‌నే బ్రేక్ చేసింది. అలాగే ఈ క్రమంలో ఈ మ్యాచ్‌లో ఐదుగురు టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్స్ 50+ పరుగులు చేసి వన్డే ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు.
Updated on: Nov 13, 2023 | 7:00 AM

వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశ చివరి మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా, నెదర్లాండ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ ప్రపంచకప్‌లో వరుసగా 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఐదుగురు టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ 50+ పరుగులు చేసి వన్డే ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు.

కెప్టెన్ రోహిత్ శర్మ 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మ్యాచ్ ప్రారంభించిన శుభ్‌మన్ గిల్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 51 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు.

మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా 56 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 51 పరుగులు చేశాడు.

అదే సమయంలో, శ్రేయాస్ అయ్యర్ 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా, కేఎల్ రాహుల్ కూడా 40 బంతుల్లో 50 పరుగుల మార్కును చేరుకున్నాడు.

అర్ధసెంచరీ తర్వాత కూడా ఇన్నింగ్స్ కొనసాగించిన అయ్యర్ 94 బంతుల్లో 10 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో అజేయంగా 128 పరుగులు చేశాడు. అనంతరం ఇద్దరూ సెంచరీలు సాధించారు.

KL రాహుల్ అయ్యర్‌తో కలిసి 200 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. 64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 102 పరుగులు చేశాడు.

ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను నిలువరించడం ప్రత్యర్థులకు కష్టంగా మారింది. టీమిండియా తమ చివరి లీగ్ మ్యాచ్‌లోనూ నెదర్లాండ్స్‌పై గెలిచి ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన తమ రికార్డునే బ్రేక్ చేసింది.

ఇంతకు ముందు 2003 ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచింది. అప్పట్లో సౌరవ్ గంగూలీ టీమిండియా కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ విషయంలో టీమిండియా ఈ రికార్డును బద్దలు కొట్టింది.




