- Telugu News Photo Gallery Cricket photos Ind vs eng captain rohit sharma 2nd most catches for india in world test championship
IND vs ENG: బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ తగ్గేదేలే.. హైదరాబాద్‌లో రోహిత్ స్పెషల్ రికార్డ్..
Rohit Sharma IND vs ENG: హైదరాబాద్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ సందర్భంగా టెస్టు క్రికెట్‌కు సంబంధించిన ఓ ప్రత్యేక రికార్డు టీమిండియా సారథి రోహిత్ శర్మ పేరు మీద నమోదైంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ దిగ్గజాన్ని వెనక్కు నెట్టాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Jan 26, 2024 | 12:44 PM

Rohit Sharma, IND vs ENG: భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట చాలా రికార్డులు నమోదయ్యాయి. అతను చాలాసార్లు తన బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. ఇప్పుడు ఫీల్డింగ్‌కు సంబంధించిన రికార్డు కూడా రోహిత్ పేరు మీద నమోదైంది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా టీమ్‌ఇండియా నుంచి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ విషయంలో వెటరన్ ఆటగాడు అజింక్యా రహానెను రోహిత్ వెనక్కు నెట్టేశాడు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘనత సాధించాడు.

నిజానికి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ తరపున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఘనత విరాట్ కోహ్లిదే. ఆ తర్వాత అజింక్యా రహానే వంతు వచ్చింది. కానీ, రోహిత్ మాత్రం రహానెను వెనక్కి నెట్టాడు. తొలిరోజు మ్యాచ్ ముగిసే వరకు రోహిత్ మొత్తం 30 క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ కాలంలో రోహిత్ 53 ఇన్నింగ్స్‌లు ఆడాడు. రహానే గురించి మాట్లాడితే, అతను 29 మ్యాచ్‌లలో 29 క్యాచ్‌లు తీసుకున్నాడు.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా తరపున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. 36 మ్యాచ్‌ల్లో కోహ్లీ 39 క్యాచ్‌లు అందుకున్నాడు. మొత్తం జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. 43 మ్యాచ్‌ల్లో 82 క్యాచ్‌లు అందుకున్నాడు.

ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు జో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు. రూట్ 48 మ్యాచ్‌ల్లో 76 క్యాచ్‌లు పట్టాడు. బెన్ స్టోక్స్ మూడో స్థానంలో ఉన్నాడు. స్టోక్స్ 41 మ్యాచ్‌ల్లో 45 క్యాచ్‌లు అందుకున్నాడు.




