Rohit Sharma: ఛీ, ఛీ, ఇంత దారుణమా.. ఆస్ట్రేలియా బౌలర్ కంటే దిగజారిన రోహిత్ బ్యాటింగ్..

|

Dec 30, 2024 | 10:45 AM

Australia vs India: ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో రోహిత్ శర్మ 26 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇందులో మొత్తం 619 పరుగులు మాత్రమే చేశాడు. అంటే, హిట్‌మ్యాన్ 24.76 సగటుతో మాత్రమే పరుగులు చేశాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఇప్పటి వరకు కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.

1 / 5
మూడు మ్యాచ్‌లు.. ఐదు ఇన్నింగ్స్‌లు.. ఈ బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో ఇప్పటివరకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 31 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అత్యధిక స్కోర్ 10 పరుగులు. మిగతా అన్ని ఇన్నింగ్స్‌ల్లోనూ స్కోరు సింగిల్ డిజిట్ కూడా దాటలేదు.

2 / 5
ముఖ్యంగా టీమిండియాకు కీలకమైన మెల్ బోర్న్ టెస్టులో ఇన్నింగ్స్ ప్రారంభించిన హిట్ మ్యాన్ తొలి ఇన్నింగ్స్ లో 3 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్ లో 9 పరుగులకే ఔటయ్యాడు. దీంతో అతను 5 ఇన్నింగ్స్‌ల్లో 31 పరుగులు చేశాడు.

3 / 5
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇదే మెల్‌బోర్న్ మైదానంలో జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ 41 పరుగులు చేశాడు. అది కూడా యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, సిరాజ్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లకు వ్యతిరేకంగా ఈ పరుగులు చేయడం విశేషం.

4 / 5
అంటే, ఐదు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ చేసిన మొత్తం స్కోరు కంటే ఒకే మ్యాచ్‌లో నాథన్ లియాన్ స్కోరు ఎక్కువ. అంతే కాకుండా మెల్‌బోర్న్‌లో మరో ఆస్ట్రేలియా బౌలర్ స్కాట్ బోలాండ్ 21 పరుగులు చేశాడు.

5 / 5
కానీ, భారత జట్టు కెప్టెన్ గత 5 ఇన్నింగ్స్‌ల్లో 31 పరుగులు మాత్రమే చేశాడు. అది కూడా సగటున 6.20 వద్ద ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకే బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ తర్వాత రోహిత్ శర్మ భారత జట్టుకు దూరమైనా ఆశ్చర్యపోనవసరం లేదు.