- Telugu News Photo Gallery Cricket photos Icc t20 rankings babar azam slipped to number 4 surya kumar yadav still number 1 in icc ranking
ICC T20I Ranking: బాబర్ అజాంకు భారీ షాక్.. నంబర్ వన్‌లోనే టీమిండియా మిస్టర్ 360 ప్లేయర్..
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే పాక్ సారథి బాబర్ ఆజం మాత్రం తన స్థానాన్ని కోల్పోయాడు.
Updated on: Nov 23, 2022 | 5:01 PM

తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.జాబితాలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజంకు భారీ షాక్ తగిలింది. బ్యాడ్ ఫామ్‌తో సతమతమవుతున్న అజమ్ ఇప్పుడు ప్రపంచంలోని టాప్ త్రీ టీ20 బ్యాట్స్‌మెన్స్ నుంచి మిస్సయ్యాడు. అదే సమయంలో, భారత తుఫాన్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ తన అగ్రస్థానాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు.

బాబర్ ఆజం గత వారం వరకు మూడో స్థానంలో ఉన్నాడు. అయితే, న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే అతనిని అధిగమించి మూడో స్థానంలో నిలిచాడు. 778 పాయింట్లతో పాక్ కెప్టెన్ అజామ్ నాలుగో స్థానానికి పడిపోయాడు.

భారత స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 124 పరుగులు చేశాడు. సూర్యకుమార్‌కు 890 పాయింట్లు సాధించాడు.

అదే సమయంలో భారత యువ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ 10 స్థానాలు ఎగబాకి 33వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో విరాట్ కోహ్లీ భాగం కాకపోవడంతో రెండు స్థానాలు కోల్పోయాడు. ఇప్పుడు 13వ స్థానానికి పడిపోయాడు.

ఇక బౌలర్ల విషయానికొస్తే.. శ్రీలంకకు చెందిన వనిందు హసరంగ మొదటి స్థానంలో నిలిచాడు. అదే సమయంలో అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రెండో స్థానంలో, ఇంగ్లండ్ ఆటగాడు ఆదిల్ రషీద్ మూడో స్థానంలో ఉన్నారు. టాప్ 10 బౌలర్లలో ఒక్క భారత బౌలర్ కూడా లేడు.




