Team India: లంకకు చుక్కలు.. కివీస్‌కు ముచ్చెమటలు.. కట్ చేస్తే.. కోహ్లీకీ షాకిచ్చిన యంగ్ ప్లేయర్.. ఎవరంటే?

|

Jan 25, 2023 | 5:31 PM

Shubman Gill ODI Ranking: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో శుభ్‌మన్ గిల్ ప్రయోజనం పొందాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్-10కి చేరుకున్నాడు.

1 / 8
ODI Batting Rankings: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 360 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్ బ్యాట్స్‌మెన్ వన్డే ర్యాంకింగ్స్‌లో 6వ స్థానానికి చేరుకున్నాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-10లో చేరడం ఇదే తొలిసారి.

2 / 8
ఇక్కడ విశేషమేమిటంటే.. ఫామ్‌లో ఉన్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీని కూడా వెనక్కునెట్టాడు. ప్రస్తుతం కోహ్లి ఏడో స్థానానికి పడిపోయాడు. ఇక భారత్‌ నుంచి టాప్-10లో రోహిత్ శర్మ కూడా ఉన్నాడు.

3 / 8
రెండు వారాల క్రితం శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన శుభ్‌మన్ గిల్.. వన్డే ర్యాంకింగ్స్‌లో లాంగ్ జంప్ చేసి 26వ స్థానానికి చేరుకున్నాడు.

4 / 8
బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సెంచరీ చేసిన శుభమాన్ గిల్.. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 7వ ఆటగాడిగా నిలిచాడు. 54 బంతుల్లోనే సెంచరీ చేసిన గిల్, 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 126 పరుగులు చేశాడు.

5 / 8
  భారత జట్టు తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో గిల్ కంటే ముందు ఈ ఘనతను కొద్ది మంది ప్లేయర్లు మాత్రమే సాధించారు. మరి ఆ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

6 / 8
గత వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ 10వ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు స్టీవ్ స్మిత్‌తో కలిసి సంయుక్తంగా ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. ఇండోర్ వన్డేలో సెంచరీ కారణంగా రోహిత్ శర్మ ర్యాంకింగ్ మెరుగుపడింది.

7 / 8
వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌కు చెందిన బాబర్ అజామ్ (887) అగ్రస్థానంలో ఉన్నాడు. రెండవ, మూడవ స్థానంలో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ నిలిచారు. రాసి వాన్ డెర్ డస్సెన్ (766) రెండో స్థానంలో, క్వింటన్ డికాక్ (759) మూడో స్థానంలో ఉన్నారు.

8 / 8
ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (747), ఇమామ్ ఉల్ హక్ (740), శుభ్‌మన్ గిల్ (734), విరాట్ కోహ్లీ (727), స్టీవ్ స్మిత్ (719), రోహిత్ శర్మ (719), జానీ బెయిర్‌స్టో (710) ఉన్నారు.