Rohit Sharma-ViratKohli: కోహ్లీ- రోహిత్‌ల రిటైర్మెంట్ వెనక అతని హస్తం? బీసీసీఐకు ముందుగానే ..

|

Jun 30, 2024 | 10:21 PM

క్రికెట్‌ను సువర్ణ శకం దిశగా నడిపించిన ముగ్గురు దిగ్గజాలు టీ 20ల్లో తమ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజా పాటు టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పొట్టి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. విశ్వ విజేతలుగా నిలవాలన్న కల నెరవేరగానే ఈ నలుగురు తమ కెరీర్‌లకు ముగింపు పలికారు.

1 / 6

2 / 6
ఈ ప్రపంచకప్ రోహిత్‌, విరాట్‌ కోహ్లీ ద్వయానికి చివరిదన్న అంచనాలను నిజం చేస్తూ వీరిద్దరూ వీడ్కోలు ప్రకటన చేసేశారు. విధ్వంస బ్యాటర్లుగా... మెరుపు వీరులుగా గుర్తింపు పొందిన ఈ దిగ్గజ ఆటగాళ్ల రిటైర్‌మెంట్‌తో టీమిండియాలో ఓ శకం ముగిసింది.

3 / 6
2007లో తొలిసారి టీ 20 ప్రపంచకప్‌ ముద్దాడిన జట్టులో భాగమైన రోహిత్‌... ఇప్పుడు రెండోసారి ఆ ఘనతను అందుకుని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. కింగ్‌ విరాట్‌ కోహ్లీ మ్యాచ్‌ ముగిసిన వెంటనే తాను పొట్టి క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించగా... కాసేపటికే రోహిత్‌ శర్మ కూడా రిటర్మెంట్‌ ప్రకటించారు.

4 / 6
ఇదిలా ఉంటే ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో ఇద్దరు దిగ్గజాలు ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే బీసీసీఐ వారిద్దరికీ నోటీసులు ఇచ్చింది. ఈ ఎంపికకు ముందే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఇదే చివరి టీ20 ప్రపంచకప్ అని తేల్చి చెప్పింది.

5 / 6
అలాగే, 2026 టీ20 ప్రపంచకప్‌కు ముందు కొత్త జట్టును ఏర్పాటు చేయబోతున్నాం. టీ20 జట్టులో సీనియర్ ఆటగాళ్లకు చోటు దక్కదని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ తెలిపింది.

6 / 6
దీని తర్వాత, టీమిండియా కొత్త కోచ్‌గా నియమితులైన గౌతమ్ గంభీర్ కూడా తన డిమాండ్‌లో భాగంగా టీ20 జట్టులోని సీనియర్ ఆటగాళ్లను దూరం పెట్టాలన బీసీసీఐకి చెప్పాడు. బీసీసీఐ కూడా గంభీర్ డిమాండ్‌ను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి తెలియజేసింది.