- Telugu News Photo Gallery Cricket photos From Misbah ul Haq to Dwayne Smith these 3 players never scored century in odi career check here full list
ఇంత బోరింగ్ బ్యాట్స్‌మెన్స్ ఏంట్రా బాబు.. కెరీర్‌లో ఒక్క వన్డే సెంచరీ కూడా చేయలే.. లిస్టులో స్టార్స్ ప్లేయర్స్..
ODI Records: ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు భారత మాజీ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఈ ఫార్మాట్‌లో అతని పేరుతో 49 సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రస్తుతం వన్డేల్లో..
Updated on: Dec 10, 2022 | 11:59 AM

ODI Centuries: ప్రస్తుత రోజుల్లో వన్డే క్రికెట్‌లో సెంచరీ చేయడం అంత కష్టం కాదు. ఇంతకుముందు మైదానాలు పెద్దగా ఉండడం.. పిచ్ కూడా బౌలర్‌లకు సహాయకరంగా ఉండేది. ఈ రోజుల్లో గ్రౌండ్‌ల పరిమాణం మునుపటి కంటే చిన్నది. ఈ పవర్‌ప్లేల వల్ల బ్యాటింగ్ సులభం అయింది. 90వ దశకంలో మొదటి వన్డేలో, 50-60 స్ట్రైక్ రేట్ కూడా మంచిదని భావిస్తున్నారు. అయితే నేటి బ్యాట్స్‌మెన్స్ టెస్ట్ క్రికెట్‌లో ఇదే స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తుంటారు.

మనం వన్డే క్రికెట్ గురించి మాట్లాడితే, ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు భారత మాజీ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఈ ఫార్మాట్‌లో అతని పేరుతో 49 సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రస్తుతం వన్డేల్లో 43 సెంచరీలు సాధించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఈ సంఖ్యను తాకేందుకు దగ్గర్లో ఉన్నాడు. కొంతమంది బ్యాట్స్‌మెన్స్ వన్డేల్లో ఎన్నో సెంచరీలు సాధించగా, కొంతమంది దిగ్గజ బ్యాట్స్‌మెన్స్ ఈ ఫార్మాట్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయారు. అలాంటి వారెవరో ఇప్పుడు చూద్దాం..

1. మిస్బా-ఉల్-హక్: పాకిస్తాన్ మాజీ బ్యాట్స్‌మెన్ మిస్బా-ఉల్-హక్ దశాబ్దానికి పైగా అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. అయితే, అతను వన్డే క్రికెట్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. మిస్బా టెస్ట్ క్రికెట్‌లో తన కెప్టెన్సీలో పాకిస్థాన్ జట్టును గొప్ప విజయాల వైపు నడిపించాడు. టెస్టులతో పోలిస్తే వన్డే ఫార్మాట్‌లో మిస్బా ప్రదర్శన అంత గొప్పగా లేదు. 162 వన్డేలు ఆడినప్పటికీ మిస్బా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అతను ఈ ఫార్మాట్‌లో 42 అర్ధ సెంచరీలు చేశాడు. అత్యధిక స్కోరు 96 నాటౌట్‌గా నిలిచాడు.

2. ఆల్విన్ కాళీచరణ్: వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ ఆల్విన్ కల్లిచరణ్ టెస్టు క్రికెట్‌లో 12 సెంచరీలు సాధించాడు. కానీ, వన్డే క్రికెట్‌లో అతనికి ఒక్క సెంచరీ కూడా లేదు. అతను తన ODI కెరీర్‌లో 31 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 6 అర్ధ సెంచరీలు చేశాడు. వన్డేలలో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 78గా నిలిచింది. ఇది అతను ఆస్ట్రేలియాపై బాదేశాడు.

3. డ్వేన్ స్మిత్: వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ డ్వేన్ స్మిత్ టీ20లో నిష్ణాతుడైన ఆటగాడు. టీ20 క్రికెట్‌లో 7000కు పైగా పరుగులు చేసినప్పటికీ వన్డే క్రికెట్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. 100 వన్డేలకు పైగా ఆడినప్పటికీ, ఈ ఫార్మాట్‌లో స్మిత్‌కు ఒక్క సెంచరీ కూడా చేయలేదు. వన్డే క్రికెట్‌లో అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 97 మాత్రమే. టీ20 క్రికెట్ గురించి మాట్లాడితే, అతను ఈ ఫార్మాట్‌లో 5 సెంచరీలను చేశాడు. అతను ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లలో ఆడి సెంచరీలు సాధించాడు.





























