Power Play: పవర్ ప్లేలో పవర్ హిట్టింగ్.. 6 ఓవర్లలోనే మైదానంలో భూకంపం.. కట్‌చేస్తే.. లిస్టులో టీమిండియా మాజీ ప్లేయర్..

|

Apr 28, 2024 | 11:51 AM

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) చరిత్రలో మొదటి 6 ఓవర్లలో కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ మాత్రమే అత్యధిక పరుగులు చేశారు. ఈ ముగ్గురిలో ఇద్దరు ఈ ఐపీఎల్ ద్వారానే ఈ ఘనత సాధించడం విశేషం. ఈ జాబితాలో భారత ఆల్ రౌండర్ అగ్రస్థానంలో ఉండటం మరో విశేషమే. పూర్తి జాబితాను ఓసారి చూద్దాం..

1 / 6
IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యువ ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, టీ20 క్రికెట్ పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్ జాబితాలోకి ప్రవేశించారు. అది కూడా పవర్ హిట్టింగ్ బ్యాటింగ్‌తోనే కావడం విశేషం.

2 / 6
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జేక్ ఫ్రేజర్ కేవలం 27 బంతుల్లో 6 భారీ సిక్సర్లు, 11 ఫోర్లతో 84 పరుగులు చేసి సందడి చేశాడు. విశేషమేమిటంటే ఈ 84 పరుగులలో తొలి 6 ఓవర్లలో 78 పరుగులు రావడం గమనార్హం.

3 / 6
దీంతో పాటు టీ20 క్రికెట్ పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో జేక్ ప్రసయ్ మెక్‌గర్క్ మూడో స్థానంలో నిలిచాడు.

4 / 6
టీ20 క్రికెట్ చరిత్రలో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సురేష్ రైనా రికార్డు సృష్టించాడు. 2014లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రైనా CSK తరుపున రెచ్చిపోయి కేవలం 25 బంతుల్లో 87 పరుగులు చేశాడు. ఇది ఇప్పటికీ రికార్డుగా నిలుస్తోంది.

5 / 6
ఈ జాబితాలో ట్రావిస్ హెడ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఈ IPL మ్యాచ్‌లో, పవర్‌ప్లే ముగిసే సమయానికి ట్రావిస్ హెడ్ 26 బంతుల్లో 84 పరుగులు చేశాడు. దీంతో టీ20 క్రికెట్‌లో తొలి 6 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన 2వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

6 / 6
ఇప్పుడు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ మొదటి 6 ఓవర్లలో 24 బంతుల్లో 78 పరుగులు చేశాడు. దీంతో టీ20 క్రికెట్‌లో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.