
Delhi Capitals vs Sunrisers Hyderabad: అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. పవర్ ప్లేలో తొలి 6 ఓవర్లలోనే 125 పరుగులు చేసింది. తద్వారా సరికొత్త రికార్డును ఖాతాలో వేసుకుంది

జట్టుకు ఓపెనర్లుగా వచ్చిన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఎప్పటిలాగే తమ మెరుపు బ్యాటింగ్ తో జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఈ ఇద్దరు ఓవర్ కి 20కి పైగా పరుగులు చేశారు.

ఢిల్లీ లో తొలి ఓవర్ వేసిన ఖలీల్ అహ్మద్ ఈ ఓవర్లో 19 పరుగులు ఇచ్చాడు. లలిత్ యాదవ్ వేసిన రెండో ఓవర్‌లో 21 పరుగులు వచ్చాయి.

4వ ఓవర్‌లో లలిత్ యాదవ్ పై విరుచుకు పడిన హైదరాబాదీ బ్యాటర్లు 21 పరుగులు రాబట్టారు. ఐదో ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ కూడా ఖర్చుతో 20 పరుగులు ఇచ్చాడు. తద్వారా హైదరాబాద్ జట్టు ఐదో ఓవర్ లోనే సెంచరీ మార్కును దాటేసింది.

నోకియా వేసిన 3వ ఓవర్‌లో 22 పరుగులు వచ్చాయి. దీంతో ఈ ఓవర్లో హైదరాబాద్ స్కోరు 50 పరుగుల మార్కును దాటగా, ట్రావిస్ హెడ్ కూడా కేవలం 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఇద్దరు ఓపెనర్లతో సెంచరీ భాగస్వామ్యం కూడా ఉంది. పవర్ ప్లే చివరి ఓవర్‌లో అంటే 6వ ఓవర్‌లో 22 పరుగులు వచ్చాయి. ముఖేష్ కుమార్ వేసిన ఈ ఓవర్లో హెడ్ వరుసగా 4 బౌండరీలు బాదాడు.