- Telugu News Photo Gallery Cricket photos CWC 2023: Top 5 batters with most runs in a single edition of the ODI World Cup
ODI World Cup 2023: ఒకే ఎడిషన్ వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు.. టాప్ 5 లిస్టులో ఇద్దరు మనోళ్లే..
ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ ప్రారంభ సమయం ఆసన్నమైంది. మరో 24 గంటల్లో భారత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇక ఈ టోర్నీపై ప్రపంచ క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన 13 వరల్డ్ కప్ టోర్నీల్లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎవరో మీకు తెలుసా..? టాప్ 5 లిస్టులో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం..
Updated on: Oct 04, 2023 | 9:42 AM

సచిన్ టెండూల్కర్: దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 2023 ప్రపంచ కప్ టోర్నీలో సచిన్ టెండూల్కర్ 61 సగటుతో మొత్తం 673 పరుగులు చేశాడు. తద్వారా ఒకే ఎడిషన్ వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచాడు. ఆ టోర్నీలో సచిన్ ఒక్క సెంచరీ మాత్రమే చేయడం గమనార్హం.

మాథ్యూ హేడెన్: 2007 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ 659 పరుగులు చేశాడు. దీంతో సచిన్ తర్వాత ఒకే ఎడిషన్ వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రెండో స్థానాన్ని పొందాడు. వెస్టిండీస్‌లో జరిగిన ఈ టోర్నీలో మాథ్యూ హేడెన్ 77 సగటుతో పాటు 3 సెంచరీలు చేశాడు. ఇంకా ఆసీస్ 2007 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.

రోహిత్ శర్మ: ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 2019 వరల్డ్ కప్‌లో టీమిండియా కెప్టెన్ పరుగుల వర్షం కంటే సెంచరీల వరద పారించాడు. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు చేశాడు. ఇంకా 81 సగటుతో మొత్తం 648 పరుగులు చేసి వరల్డ్ కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో శర్మ విఫలమవడంతో భారత్ వెనుదిరిగింది.

డేవిడ్ వార్నర్: ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 2019 వరల్డ్ కప్‌లోనే డేవిడ్ వార్నర్ కూడా 71 సగటుతో 647 పరుగులు చేశాడు. ఇలా ఒకే ఎడిషన్ వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నాలుగో స్థానంలో నిలిచాడు. 2019 టోర్నీలో వార్నర్ 3 సెంచరీలు కూడా చేశాడు.

షకిబ్ అల్ హాసన్: ఈ లిస్టులో చివరి స్థానంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హాసన్ ఉన్నాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 2019 వరల్డ్ కప్‌లోనే షకిబ్ కూడా 2 సెంచరీలు, 86 సగటుతో 606 పరుగులు చేశాడు.





























