
ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోపీ 2025 మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈ నెల 19న పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ మొదలవనుంది. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నా కూడా టీమిండియా మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి. భారత జట్టును పాకిస్థాన్ పంపేందుకు బీసీసీఐ అంగీకరించకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తున్నారు. టోర్నీ విషయం పక్కనపెడితే.. ఓ భారత స్టార్ ప్లేయర్‌కు బీసీసీఐ భారీ షాకిచ్చినట్లు తెలుస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో జట్టులో దిగ్గజ ప్లేయర్‌గా ఉన్న ఓ ఆటగాడు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఫేలవ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ఓడిపోయింది భారత జట్టు. సీనియర్ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఈ సిరీస్‌లో విఫలం అయ్యారు. అలాగే హెడ్ కోచ్‌గా ఉన్న గౌతమ్ గంభీర్‌పై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. అతని కోచింగ్‌లో టీమిండియా నానాటికి తీసికట్టుగా మారుతుందని క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పించారు.

అదే టోర్నీ మధ్యలోనే రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం, జట్టు ప్రదర్శనపై డ్రెస్సింగ్ రూమ్‌లో వాడీవేడి చర్చలు జరగడం, అవి లీక్ కావడం, దానికి ఓ యంగ్ ప్లేయర్ కారణం అంటూ గంభీర్ గుర్తించినట్లు వార్తలు రావడం.. ఇలా బీజీటీ టోర్నీ ఇండియన్ క్రికెట్‌ను ఓ కుదుపు కుదిపేసింది. దాంతో బీసీసీఐ కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంది. భారత జట్టు ఆటగాళ్లంతా డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందే అని రూల్ తెచ్చింది. అలాగే విదేశీ టూర్లకు వెళ్లే సమయంలో కుటుంబాలను అనుమతించేది లేదని తేల్చిచెప్పేసింది. ఇక తాజాగా ఆటగాళ్లు క్యారీ చేసే లగేజ్ కూడా లిమిట్‌ను పెట్టింది.

ప్రతి ఆటగాడు కేవలం 150 కేజీల లగేజీ మాత్రం తమతో పాటు క్యారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి ఒక కారణం కూడా ఉంది. ఇటీవలె బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ కోసం ఓ స్టార్ ఆటగాడు ఏకంగా 27 బ్యాగులను తన లగేజ్‌లో తెచ్చుకున్నట్లు సమాచారం. అందులో తన పర్సనల్ బ్యాట్లు ఏకంగా 17 ఉన్నాయంటా. మొత్తం లగేజ్ బరువు 250 కేజీలని తెలుస్తోంది. ఈ లగేజ్‌ను విమానంలో ఆస్ట్రేలియాకు తీసుకెళ్లడానికి, అక్కడి నుంచి వివిధ సిటీలకు మార్చేందుకు ఖర్చు మొత్తం బీసీసీఐనే భరించిందంట. అందులో కేవలం ఆటగాడికి సంబంధించిన వస్తువులనే కాకుండా తన కుటుంబ సభ్యుల వస్తువులు, తన పర్సనల్ స్టాఫ్‌కి సంబంధించిన బ్యాగులు కూడా ఉన్నాయని సమాచారం.

ఇలా ఒక్క ఆటగాడే ఏకంగా 27 బ్యాగులు ఆస్ట్రేలియాకు తీసుకెళ్లడంతో బీసీసీఐకి లక్షలల్లో ఖర్చు వచ్చింది. దీంతో ఇకపై ఏ ఆటగాడైనా సరే కేవలం 150 కేజీల లగేజ్ మాత్రమే తీసుకురావాలని, అంతకు మించి తీసుకొస్తే.. దాని ఖర్చులు ఆటగాళ్లే స్వయంగా భరించాలని కూడా బీసీసీఐ క్లియర్‌గా చెప్పేసింది. అయితే.. ఆస్ట్రేలియాకు 27 బ్యాగుల భారీ లగేజ్ తీసుకొచ్చిన ఆటగాడు ఎవరనే విషయాన్ని మాత్రం బీసీసీఐ బయటపెట్టలేదు. క్రికెట్ అభిమానులు మాత్రం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. వీరి ఇద్దరిలో ఒకరై ఉంటారని అనుకుంటున్నారు.