IPL 2025: అమ్మకానికి గుజరాత్ టైటాన్స్.. కన్నేసిన అదానీ గ్రూప్.. డీల్ ఎన్ని కోట్లంటే?

|

Jul 20, 2024 | 2:42 PM

Gujarat Titans Stake Sale: మూడేళ్ల క్రితం, ఐపీఎల్‌లో గుజరాత్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ ఆఫర్ చేసింది. ఇందుకోసం అదానీ గ్రూప్ 5,100 కోట్లు బిడ్డింగ్ చేసింది. కానీ, సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ రూ.5625 కోట్లతో గుజరాత్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయగలిగింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ తన వాటాను విక్రయించేందుకు సిద్ధమైంది.

1 / 5
సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్‌కు చెందిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ తన వాటాను విక్రయించేందుకు సిద్ధమైంది. ఐపీఎల్‌లో మూడు సీజన్‌లు ఆడిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ మెజారిటీ షేర్లను విక్రయించాలని నిర్ణయించగా, అదానీ గ్రూప్, టొరెంట్ గ్రూప్‌లు ఈ షేర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

2 / 5
అదానీ గ్రూప్ ఇప్పటికే మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్‌ను కలిగి ఉంది. అలాగే గతంలో ఐపీఎల్ జట్లను కొనుగోలు చేస్తామని ఆఫర్ చేసినా.. బిడ్డింగ్ లో మాత్రం విఫలమైంది. గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పుడు తన షేర్లను విక్రయిస్తున్నందున అదానీ గ్రూప్ ఐపీఎల్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

3 / 5
2021లో, CVC క్యాపిటల్ పార్టనర్స్ గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీని రూ. 5625 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత జట్టు యాజమాన్యంలో మెజారిటీని అమ్మేయాలని నిర్ణయించుకోవడం విశేషం.

4 / 5
దీని ప్రకారం, మూడేళ్ల గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ విలువ దాదాపు 1.5 బిలియన్లుగా చెప్పవచ్చు. దీంతో గుజరాత్ టైటాన్స్ షేర్లను ఎవరు కొనుగోలు చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే కొత్త జట్లకు వాటాను విక్రయించడానికి ఫిబ్రవరి 2025 వరకు మాత్రమే సమయం ఉంది. దీనికి ముందు, అదానీ గ్రూప్, టోరెంట్ గ్రూప్ డీల్ క్లోజ్ చేయడానికి CVC క్యాపిటల్ పార్ట్‌నర్స్‌తో చర్చలు జరిపాయి.

5 / 5
అదానీ గ్రూప్ గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేస్తే, జట్టు పేరు మారే అవకాశం ఉంది. ఎందుకంటే అదానీ గ్రూప్ మహిళల ప్రీమియర్ లీగ్, లెజెండ్స్ క్రికెట్ లీగ్, ప్రో కబడ్డీ లీగ్,  అల్టిమేట్ ఖో ఖో లీగ్‌లలో గుజరాత్ జెయింట్స్ పేరుతో జట్లను కలిగి ఉంది. కాబట్టి గుజరాత్ టైటాన్స్ అదానీగా మారితే ఆ జట్టు పేరు గుజరాత్ జెయింట్స్ గా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు.