Alcohol: ఈ దేశాల్లో ఏ వయసు వారైనా విచ్చలవిడిగా మద్యం తాగేయెచ్చు.. ఎలాంటి ఆంక్షలు లేవ్!

| Edited By: Ravi Kiran

Sep 28, 2024 | 7:52 PM

చట్టం దృష్టిలో మద్యం సేవించడం నేరం కాదు. అయితే దీనికి ప్రత్యేక వయోపరిమితి ఉంది. చట్టాలు నిర్ణయించిన వయసు కంటే చిన్న వయసు వారు మద్యం కొనడం, తాగడం రెండూ శిక్షార్హమైన నేరాలే. మైనర్‌కు మద్యం అమ్మడం కూడా నేరమే. దానిని కొనే లేదా తాగే వ్యక్తితోపాటు విక్రేత కూడా శిక్ష అనుభవించవల్సి ఉంటుంది..

1 / 5
చట్టం దృష్టిలో మద్యం సేవించడం నేరం కాదు. అయితే దీనికి ప్రత్యేక వయోపరిమితి ఉంది. చట్టాలు నిర్ణయించిన వయసు కంటే చిన్న వయసు వారు మద్యం కొనడం, తాగడం రెండూ శిక్షార్హమైన నేరాలే. మైనర్‌కు మద్యం అమ్మడం కూడా నేరమే. దానిని కొనే లేదా తాగే వ్యక్తితోపాటు విక్రేత కూడా శిక్ష అనుభవించవల్సి ఉంటుంది.

2 / 5
ఉదాహరణకు మన దేశం విషయానికొస్తే మద్యం సేవించడానికి కనీస వయసు 18 సంవత్సరాలు. ఈ పరిమితి దాటితేనే ప్రభుత్వం మద్యం తాగేందుకు అనుమతిస్తుంది. అంత దిగువ వయసు వారు మద్యం సేవించడం చట్టరీత్యా నేరం. ఈ నియమం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఉంది. కానీ ఏ వయస్సులోనైనా మద్యం సేవించే దేశాలు కూడా కొన్ని ఉన్నాయి.

3 / 5
అర్మేనియా, మకావు వంటి అనేక దేశాల్లో మద్యం యదేచ్ఛగా తాగేయొచ్చు. 18 ఏళ్లలోపు వారు ఎవరైనా మద్యం కొని తాగవచ్చు. మద్యం కొనడానికి లేదా తాగడానికి ఎలాంటి వయస్సు పరిమితి లేదు. అలాగే ఆర్మేనియాలో ధూమపానానికి వయోపరిమితి లేదు. ఎవరైనా మద్యం కొనుగోలు చేయవచ్చు, పొగ తాగవచ్చు. కానీ బెల్జియంలో మాత్రం 16 ఏళ్లు నిండితే తప్ప మద్యం తాగకూడదు. ఇక్కడ పబ్బులు లేదా క్లబ్‌లలో తప్ప బహిరంగంగా మద్యం తాగడం నేరం.

4 / 5
బల్గేరియాలో మద్యం కొనుగోలు చేసే ముందు కొనుగోలుదారు వయస్సుని తప్పనిసరిగా తనిఖీ చేస్తారు. 18 ఏళ్లలోపు ఎవరికీ మద్యం విక్రయించరాదు. తూర్పు ఆఫ్రికా దేశమైన జిబౌటీలో మద్యం ధరలు ఆకాశాన్నంటుతాయి. దానికి కారణం.. ఫ్రాన్స్ నుండి వైన్ అక్కడికి రవాణా చేయడమే. అయితే మద్యం ధర ఎక్కువగా ఉన్నప్పటికీ తాగేందుకు ఇక్కడ ఎలాంటి వయోపరిమితి లేదు.

5 / 5
వియత్నాంలో పర్యాటక కేంద్రం చాలా ముఖ్యమైన దేశం. ఈ దేశంలో పర్యాటకుల కోసం మద్యం షాపుల తలుపులు 24 గంటలు తెరిచి ఉంటాయి. వియత్నాంలో ఏ వయసు వారైనా మద్యం తాగవచ్చు.  ఐరోపాలోని డెన్మార్క్‌లో కూడా మద్యం సేవించడంపై ఎలాంటి ఆంక్షలు లేవు. అయితే, మద్యం కొనుగోలుకు ప్రత్యేక నియమాలు ఉన్నాయి. 16 ఏళ్లలోపు ఎవరూ షాప్‌లలో మద్యం కొనుగోలు చేయకూడదు. మద్యం పరిమాణంపై కూడా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. 16.5 శాతం కంటే తక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాలు మాత్రమే కొనుగోలు చేయడానికి అనుమతి ఉంటుంది.