How to Get Rid of Calluses: రోజూ రాత్రి నిద్రకు ముందు కాసిన్ని నీళ్లలో పాదాలు నానబెట్టారంటే.. రెండు రోజుల్లోనే అద్భుతం చూస్తారు!

|

May 10, 2024 | 9:14 PM

రోజంతా పాదాలు ధుమ్మూ, ధూళి వంటి పలురకాలుగా మురికితో నిండిపోయి ఉంటాయి. దీనితోపాటు నడవడం, ఎక్కువ సేపు కాళ్లు వేలాడుతూ కూర్చోవడం, రకరకాల డిజైన్ల స్టైలిష్ షూస్ ధరించడం, అసమానమైన రోడ్లపై హైహీల్స్ ధరించి నడవడం.. వంటి పలు కారణాల వల్ల పాదాలపై ఒత్తిడిని పెరుగుతుంది. ఒత్తిడి ఎక్కువగా ఉండే ప్రదేశంలో డెడ్ స్కిన్ పేరుకుపోయి గట్టిపడుతుంది. అందుకే పాదాలు మృదువుగా ఉంచుకోవాలంటే సౌకర్యవంతంగా ఉండే బూట్లు ధరించడం చాలా ముఖ్యం..

1 / 5
రోజంతా పాదాలు ధుమ్మూ, ధూళి వంటి పలురకాలుగా మురికితో నిండిపోయి ఉంటాయి. దీనితోపాటు నడవడం, ఎక్కువ సేపు కాళ్లు వేలాడుతూ కూర్చోవడం, రకరకాల డిజైన్ల స్టైలిష్ షూస్ ధరించడం, అసమానమైన రోడ్లపై హైహీల్స్ ధరించి నడవడం.. వంటి పలు కారణాల వల్ల పాదాలపై ఒత్తిడిని పెరుగుతుంది.

2 / 5
ఒత్తిడి ఎక్కువగా ఉండే ప్రదేశంలో డెడ్ స్కిన్ పేరుకుపోయి గట్టిపడుతుంది. అందుకే పాదాలు మృదువుగా ఉంచుకోవాలంటే సౌకర్యవంతంగా ఉండే బూట్లు ధరించడం చాలా ముఖ్యం.  లేదంటే పాదాలపై గాయాలు ఏర్పడతాయి.

3 / 5
పాదాలు గట్టిపడకుండా ఉండాలంటే ప్రతి రాత్రి కనీసం 20 నిమిషాల పాటు పాదాలను గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. ఇందులో కొద్దిగా తేలికపాటి సబ్బు లేదా బేకింగ్ సోడా కూడా కలపవచ్చు. ఇలా చేస్తే కఠినమైన ప్రదేశం క్రమంగా మృదువుగా మారుతుంది.

4 / 5
నీళ్లలో నానబెట్టిన తర్వాత ఆ ప్రాంతాన్ని చేతులతో రుద్దితే డెడ్ స్కిన్ క్రమంగా తొలగిపోవడం కనిపిస్తుంది. ఇలా క్రమంగా చేస్తుంటే రెండు, మూడు రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. ప్యూమిస్ స్టోన్, ఫుట్ ఫైల్, ఎమెరీ బోర్డ్‌తో రుద్దినా మంచిదే.

5 / 5
పాదాలు సౌకర్య వంతంగా ఉండే బూట్లు, చెప్పులు మాత్రమే ధరించాలి. అలాగే పాదాలు తడిసిన ప్రతిసారీ వాటిని పొడిగా తుడవాలి. అలాగే సబ్బు, నీళ్లు వాడిన తర్వాత పాదాలకు క్రీమ్ రాసుకోవాలి. పాదాలు ఎంత తేమగా ఉంటే అవి అంత త్వరగా కుదుటపడతాయి. అలాగే పాదాల సంరక్షణకు రెగ్యులర్ పెడిక్యూర్ చాలా అవసరం. పార్లర్‌కి వెళ్లడం సాధ్యం కాకపోతే, ఇంట్లోనే మీ పాదాలకు పెడిక్యూర్ చేసుకోండి.