
ఎర్రటి అరటిపండులో సమృద్ధిగా ఉండే పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. రక్తపోటును నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎర్రటి అరటిపండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం కారణంగా స్మోకింగ్ అలవాటు మానేయడంలో సహాయపడుతుంది.

ఈ ఎర్ర అరటిలో ఫ్రక్టోజ్, సుక్రోజ్, గ్లూకోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి మనల్ని రోజంతా ఉత్సహంగా ఉండేలా చేస్తాయి. అలాగే, ఈ ఎర్ర అరటిపండులో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇది ట్రిప్టోఫాన్‌ను సెరోటోనిన్‌గా మారుస్తుంది. సెరోటోనిన్ మిమ్మల్ని సంతోషంగా ఉంచడంలో సహాయపడే అనుభూతిని కలిగించే హార్మోన్.

అదే విధంగా నరాలను కూడా బలపరుస్తుంది. అరటి పండులో ఉండే కొన్ని రకాల గుణాలు.. క్యాన్సర్లతో పోరాడేందుకు సహాయ పడతాయి. సంతాన లేమి సమస్యలను కూడా తగ్గించడంలో సహాయ పడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

సాధారణ అరటిపండ్లతో పోలిస్తే ఎర్రటి అరటిపండ్లలో ఎక్కువ మొత్తంలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టే సమస్యను నివారిస్తుంది. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, అనేక ఖనిజాలు ఇందులో లభిస్తాయి. ఎర్రటి అరటిపండు రుచి సాధారణ అరటిపండుతో సమానంగా ఉంటుంది. కానీ దాని వాసన బెర్రీ లాంటి పండులా ఉంటుంది.

ఎర్ర అరటిపండ్లు ప్రధానంగా ఆస్ట్రేలియాలో పండిస్తారు.వెస్టిండీస్, మెక్సికో, అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో కూడా సాగు చేస్తారు. భారతదేశంలో ఇది ప్రధానంగా కర్ణాటక చుట్టుపక్కల ప్రాంతాలలో సాగు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మార్కెట్లో విరివిగా లభిస్తోంది. మన అనారోగ్య సమస్యలన్నింటికి చెక్ పెడుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు చక్కగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.