Health Tips: అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారా..? ఈ జ్యూస్‌లతో వెంటనే బీపీకి చెక్ పెట్టేయండి..

|

Oct 04, 2023 | 12:00 PM

High BP: మానవాళిని ప్రస్తుతం వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో గుండెపోటు ప్రథమ స్థానంలో ఉంది. శరీరంలో అధిక రక్తపోటు, తీసుకునే ఆహారంలో పోషకాలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. అధిక రక్తపోటుతో గుండె సమస్యలే కాక మెదడులో రక్తస్రావం జరిగే ప్రమాదం కూడా ఉంది. అయితే వంట గదిలోనే లభించే కొన్ని కూరగాయల జ్యూస్‌లను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటును నివారించవచ్చు.

1 / 5
అధిక రక్తపోటుతో గుండె సమస్యలే కాక మెదడులో రక్తస్రావం జరిగే ప్రమాదం కూడా ఉంది. అయితే వంట గదిలోనే లభించే కొన్ని కూరగాయల జ్యూస్‌లను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటును నివారించవచ్చు. ఇందుకోసం ఏయే జ్యూస్‌లను తాగాలంటే..?

2 / 5
బచ్చలికూర జ్యూస్: శరీరానికి మేలు చేసే ఆకు కూరల్లో బచ్చలి కూర కూడా ఒకటి. ఇందులో పుష్కలంగా ఉండే పొటాషియం కారణంగామ మావన శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇంకా రక్తపోటు కూడా బ్యాలన్స్డ్‌గా ఉంటుంది.

3 / 5
బీట్‌రూట్‌ జ్యూస్: ప్రొటీన్, విటిమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి పలు పోషకాలకు ఉత్తమ ఎంపిక అయిన బీట్‌రూట్ రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని సోడియం, పొటాషియం, ఫాస్పరస్ రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి.

4 / 5
టమాటో జ్యూస్: ప్రతి వంట గదిలో తరచూ కనిపించే టమాటో ఆహారపు రుచినే కాక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి, ఫాస్ఫరస్, కాపర్, పొటాషియం, మెగ్నీషియం సహా అనేక పోషక మూలకాలు ఉన్నాయి. ఈ పోషకాలకు రక్తపోటును నియంత్రించే శక్తి ఉంది.

5 / 5
కాకరకాయ జ్యూస్: కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి, ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి. ఇంకా ఇందులోని విటమిన్ ఎ, విటమిన్ సి బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్ బ్యాలెన్స్ చేస్తుంది.