
కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత శరీరంలో అదనపు పొటాషియం కూడా మంచిది కాదు.. కాబట్టి, పెద్దలు కొబ్బరి నీళ్లను తక్కువ పరిమాణంలో తాగాలని వైద్యులు చెబుతున్నారు. అధిక పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది.

మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తక్కువగా తాగాలి. ఎందుకు ఇలాంటి వారిలో తమ శరీరాల ద్వారా అదనపు పొటాషియంను సరిగ్గా ఫిల్టర్ చేయలేరు. ఇది రక్తంలో అధిక స్థాయి పొటాషియం కు దారితీస్తుంది. దీనివల్ల కండరాల బలహీనత, గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు, తీవ్రమైన సందర్భాల్లో గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు

కొబ్బరి నీళ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటితో శరీరంలో కొవ్వు పేరుకుపోదు. కొబ్బరి నీళ్లు బరువు తగ్గించడమే కాకుండా ఉబ్బరం, శరీరం నీటిని నిలుపుకోవడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. బరువు తగ్గడంలో కొబ్బరి నీళ్లు ప్రభావవంతంగా పనిచేస్తాయిన పలువురు డైటిషీయన్లు సైతం చెబుతున్నారు. ఇందులో ఎలక్ట్రోలైట్ పొటాషియం ఉంటుంది. ఇది శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుతుంది.

కొబ్బరి నీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్ కంటెంట్ కారణంగా తరచుగా సహజ స్పోర్ట్స్ డ్రింక్‌గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం తర్వాత కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల చెమట ద్వారా కోల్పోయిన ఎలక్ట్రోలైట్‌లను తిరిగి శరీరానికి అందజేస్తుంది. బరువు తగ్గడంలో సమర్థవంతంగా సహాయపడుతుంది.

పొటాషియం అధికంగా ఉండటం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నీటి నిలుపుదలకు కారణమయ్యే సోడియం ప్రభావం సమతుల్యమవుతుంది. ద్రవ సమతుల్యత ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. దీనితో జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.