Climate Change: రానున్న 80 ఏళ్లలో సముద్రంలో కలిసిపోయే అందమైన దీవులు ఇవే.. ఇప్పటికే ప్రజలను తరలిస్తున్న ద్వీప దేశం…

Updated on: Aug 06, 2025 | 4:59 PM

మనిషి ఆధునిక విజ్ఞానం , సౌకర్యాల కల్పన వంటి వివిధ కారణాలతో చేస్తున్న పనులు వాతావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రకృతిలో అనేక మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే కాల గమనంలో మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. ఎండలకు, వర్షాలకు కాలంతో పనిలేదు అనిపిస్తుంది. మరోవైపు సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రపంచంలో కొన్ని దీవులు ప్రపంచ పటం నుంచి అదృశ్యం కానున్నాయి. రానున్న కాలంలో కనుమరుగయ్యే ద్వీప దేశాల్లో ప్రముఖంగా ఐదు దేశాల పేర్లు వినిపిస్తున్నాయి. ఆ దేశాలు ఏమిటంటే..

1 / 8
ఇప్పటికే వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా తెలుస్తుంది. పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రత.. సముద్ర మట్టాలు పెరగడానికి దోహదపడుతోంది. సందూర మట్టాలు పెరగడంతో లోతట్టు దీవులు, తీరప్రాంతాలు,  సమాజాల ఉనికిని ప్రమాదంలో పడేస్తున్నాయి. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం 1880 నుంచి సగటు సముద్ర మట్టం 8-అంగుళాల కంటే ఎక్కువగా పెరిగింది. ప్రతి సంవత్సరం సముద్రం మరొక 0.13-అంగుళాలు పెరుగుతుంది. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల చేసిన అధ్యయనం 2050 నాటికి సముద్ర మట్టం 12-అంగుళాలు పెరుగుతుందని అంచనా వేసింది.

2 / 8
గత దశాబ్దాలలో అనేక లోతట్టు దీవులు జాడ లేకుండా అదృశ్యమయ్యాయి. అదే విధంగా వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరుగుతూ రానున్న 80 నుంచి 100 సంవత్సరాలలో అనేక ద్వీప దేశాలు కనుమరుగయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. మాల్దీవులు, మైక్రోనేషియా, కిరిబాటి, తువాలు, వనువాటు ద్వీప దేశాలు కనుమరుగయ్యే ద్వీపాల సముద్రంలో కలిసి అదృశ్యం అయ్యే అవకాశం ఉంది. సముద్ర మట్టం పెరగడానికి ప్రధానంగా హిమానీనదాలు కరగడం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా నీటి ఉష్ణ విస్తరణ కారణమని చెబుతున్నారు.

3 / 8
మాల్దీవులు:  ఈ ద్వీప దేశం మాల్దీవులు ఒక లోతట్టు ప్రాంతం. ఇది అనేక పచ్చని రిసార్ట్‌లతో ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ప్రపంచ దేశాల్లోని ప్రజలను ఆకర్షిస్తోంది. ప్రస్తుత సముద్ర మట్టం వేగంగా పెరుగుతుంది. దీంతో  2100 నాటికి మొత్తం దేశం నీటిలో మునిగిపోవచ్చని పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

4 / 8
మైక్రోనేషియా: మైక్రోనేషియా అనేది హవాయికి నైరుతిలో 607 దీవులతో కూడిన దేశం. నీటి మట్టం పెరగడం వల్ల అనేక చిన్న దీవులు ఇప్పటికే పూర్తిగా మునిగిపోయాయి. మిగిలిన దీవుల పరిమాణం తగ్గింది.

5 / 8

ఫిజీ: దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం ఫిజీ. అందమైన బీచ్‌లతో పర్యాటకులను ఆకర్షించే ఫిజీ దేశం కూడా ప్రమాదంలో ఉంది. రోజు రోజుకీ పెరుగుతున్న సముద్ర మట్టం ఫిజీలోని పసిఫిక్ దీవులకు పెను ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పటికే  కొన్ని గ్రామాలను.. ప్రజలను ఎత్తైన ప్రాంతాలకు తరలించారు. దీవులలోని కొన్ని ప్రాంతాలు 15 నుంచి 20 మీటర్ల తీరప్రాంతాలను కోల్పోయినట్లు నివేదించాయి.
అయితే సముద్ర మట్టం పెరగడం వల్ల భవిష్యత్తులో ఈ అందమైన దేశం సముద్రంలో కలిసి పోతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫిజీ: దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం ఫిజీ. అందమైన బీచ్‌లతో పర్యాటకులను ఆకర్షించే ఫిజీ దేశం కూడా ప్రమాదంలో ఉంది. రోజు రోజుకీ పెరుగుతున్న సముద్ర మట్టం ఫిజీలోని పసిఫిక్ దీవులకు పెను ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పటికే కొన్ని గ్రామాలను.. ప్రజలను ఎత్తైన ప్రాంతాలకు తరలించారు. దీవులలోని కొన్ని ప్రాంతాలు 15 నుంచి 20 మీటర్ల తీరప్రాంతాలను కోల్పోయినట్లు నివేదించాయి. అయితే సముద్ర మట్టం పెరగడం వల్ల భవిష్యత్తులో ఈ అందమైన దేశం సముద్రంలో కలిసి పోతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

6 / 8
తువాలు: ఆస్ట్రేలియాకు ఈశాన్యాన పసిఫిక్‌మహా సముద్రంలో ఉన్న తువాలు ద్వీప దేశం. ఈ ద్వీప దేశం మొత్తం తొమ్మిది దీవులు సముదాయం. వీటిలో అయిదు పగడపు దీవులు. సముద్ర మట్టాలు పెరగడం వల్ల సముద్రంలో కలిసి పోయే ద్వీపంలో తువాలు ఒకటి. ఈ ద్వీప దేశం గ్లోబల్ వార్మింగ్ కు బలి అవుతున్న ప్రపంచంలోనే తొలి దేశంగా నిలిచింది. అత్యల్ప జనాభా కలిగిన దేశం తువాలు. దేశ జనాభా సుమారు 11,200 మంది. అయితే గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో తువాలు దీవి చుట్టూ సముద్ర మట్టం పెరగడం ప్రారంభమైంది. ఐలాండ్ కొద్ది కొద్దిగా సముద్రంలో కలిసిపోవడం మొదలైంది. ఈ ద్వీప దేశం మరికొన్ని ఏళ్లలో కనుమరుగు కానుంది. దీంతో తువాలు ఇప్పటికే తన పౌరులను ఇతర దేశాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటోంది.

7 / 8

సీషెల్స్: హిందూ మహాసముద్రంలో ఒక ద్వీపసమూహ దేశం. దేశంలోని దాదాపు 85% అభివృద్ధి పనులు తీరప్రాంతంలో ఉన్నాయి. కేవలం 1 మీటర్ సముద్ర మట్టం పెరగడం వల్ల దాని భూభాగంలో 70% నష్టం వాటిల్లుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

8 / 8

ఈ దీవులు భౌతికంగా అదృశ్యమవ్వడమే కాదు అక్కడ నివసించే జనాభా స్థానభ్రంశం చెందడం, భూమి, మౌలిక సదుపాయాల నష్టం, తమ సంస్కృతులు, ఆర్థిక వ్యవస్థలకు అంతరాయం కలిగించే ముప్పును కూడా ఎదుర్కొంటున్నాయి. తువాలు ఇప్పటికే తన పౌరులను ఇతర దేశాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటోంది.