Home Gardening: నగర వాసుల్లో పెరుగుతున్న తోటపనిపై ఆసక్తి… పువ్వుల కుండీలకు భారీ డిమాండ్

|

Dec 24, 2023 | 2:03 PM

రోజు రోజుకీ పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్నాయి. చెట్లను ప్రగతి మెట్లు అన్న స్లోగన్ గోడలమీద పోస్టర్స్ గానే మిగిలిపోతున్నాయి. అయితే మారుతున్నా వాతావరణంలో వచ్చిన మార్పులకు మానవ జీవితం అస్తవ్యస్తంగా మారుతోన్న నేపథ్యంలో మళ్ళీ చెట్లను పెంచాలనే ఆలోచన కనిపిస్తోంది. అందుకే పట్టణాలు, ప్రముఖ నగరాల్లో అందమైన ఉద్యానవనాలు పెంచుతున్నారు. అంతేకాదు తమ ఇంటి ఆవరణలో.. డాబాల మీద పచ్చని చెట్ల పెంపకంపై ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ  నేపథ్యంలో  కుండీలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది.

1 / 8
గార్డెన్ సిటీగా పిలుచుకునే బెంగళూరు సహా అనేక నగరాలు కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్నాయి. ఎక్కడ చూసినా ట్రాఫిక్ శబ్దం, వాయుకాలుష్యం, శబ్ద కాలుష్యం, నీటి కాలుష్యం వంటి సమస్యలు ప్రతిరోజూ దర్శనమిస్తున్నాయి. సహజవాయువు కోసం జనం వెతుక్కునే పరిస్థితి నెలకొంది.

2 / 8
ఇప్పుడు ఈ సమస్యలకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కావలసింది మంచి గాలి .. ఆహ్లాదకరమైన పచ్చటి వాతావరణం. అందుకే ఇళ్లల్లో ఈ పచ్చటి వాతావరణాన్ని కల్పించేందుకు నగర వాసులు ఇంటిలోనే ఉన్న స్థలంలో పచ్చని తోటల పెంపకాన్ని చేపడుతున్నారు. 

3 / 8
దీంతో గత కొంతకాలంగా వివిధ రకాల మొక్కలకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా కుండీల్లో పెంచుకునే మొక్కలకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ప్రజల డిమాండ్‌ను తీర్చడానికి వివిధ రకాల గార్డెనియా కుండలు విదేశాల నుండి మన నగరాల్లోకి ప్రవేశించాయి.

4 / 8
నగర ప్రజలు పచ్చని తోటల పెంపకంపై ఆసక్తి చూపడంతో వివిధ రకాల పూల, మొక్కల కుండీలకు డిమాండ్‌ పెరిగింది. ఇండోర్ ప్లాంట్స్ తో పాటు చిన్న చిన్న కూరగాయల మొక్కలు, పువ్వుల మొక్కల పెంపకంపై ఆసక్తిని చూపిస్తున్నారు.

5 / 8
మనీ ప్లాంట్, సక్యూలెంట్స్, బోన్సాయ్, పామ్, థుజా, అడెనియం, ఆంథోరియం, కొరియన్ పెప్పర్, ప్యాన్స్ స్టాసియా, డ్రేకెనా గోల్డ్, సిల్వర్ డాలర్, ఆంథోరియం లిల్లీ, బ్లాక్ లిల్లీ, పీస్ లిల్లీ, ఆంథోరియం లిల్లీ, చైనా డాల్, రబ్నర్ ప్లాంట్, లోటస్ వెదురు, కోన్ ఆకారం వెదురు, స్పైరల్ వెదురు కలిపి మొత్తం 150 నుంచి 160 రకాల మొక్కలకు డిమాండ్ పెరిగింది.

6 / 8
600 నుంచి 10 వేల వరకు ధర పలుకుతున్న వీటిని సహజసిద్ధంగా సాగు చేస్తున్నారు. తద్వారా నగరాల్లో  మొక్కలకు డిమాండ్ 60% పెరిగింది.  

7 / 8

కరోనా కాలంలో చాలా మందికి ఆక్సిజన్ లేకుండా పోయింది. అందుకే ఇంట్లో పచ్చని మొక్కల పెంపకాన్ని చేపట్టామని పలువురు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా రకాల ఆక్సిజన్ మొక్కలు ఉన్నాయి. మంచి గాలిని అందిస్తాయి. ఇటీవల రకరకాల కుండీలను ఇష్టపడే వారి సంఖ్య పెరిగింది.  

8 / 8
ఒత్తిడితో కూడిన జీవితం, ఆరోగ్య సమస్యల కారణంగా ప్రశాంత వాతావరణం, సహజమైన గాలి అవసరమయ్యే ఇళ్లలో గార్డెన్‌లు నిర్మించుకోవడం తప్పనిసరి.. భవిష్యత్తులో నగరం అభివృద్ధి చెందే కొద్దీ పచ్చని కుండీలకు డిమాండ్ పెరుగుతుందనడంలో సందేహం లేదు.