
ఇప్పటికే చాలా మంది హీరోయిన్ తెలుగులో రాణిస్తున్నారు వారిలో శివాని నాగరం ఒకరు. ఈ అమ్మడు చేసింది ఒకే ఒక్క సినిమా. శివాని నాగరం నటనా జీవితాన్ని ఆడిషన్‌ల ద్వారా ప్రారంభించింది. ఈ అమ్మడి మొదటి సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్

ఈ చిత్రంలో సుహాస్ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ఆమె లక్ష్మి అనే పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందంతోనూ ఈ చిన్నది కవ్వించింది.

ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇన్ స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ పంపారు, నేను హీరోయిన్ ఫ్రెండ్ రోల్ కోసం ఆడిషన్ అని వెళ్లాను. అయితే ఆడిషన్ తీసుకున్న తర్వాత హీరోయిన్ గానే తీసుకుంటున్నారు అని చెప్పారు.

మొదటి రోజు షూటింగ్ జరిగే వరకు నేనే హీరోయిన్ అనేది నమ్మలేకపోయా.. అని తెలిపింది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ క్రేజీ ఫోటోలను పంచుకుంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన కొన్ని క్యూట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ బ్యూటీ అందాన్ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.