తమిళ హీరోయిన్ బిగ్ బాస్ ఫేమ్ యషిక ఆనంద్ కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
ఫ్రెండ్స్ తో కలిసి విహార యాత్రకు వెళ్లిన ఆమె రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో యషికకు తీవ్ర గాయాలయ్యాయి.
అయితే ఈ ప్రమాదంలో ఆమె స్నేహితురాలు మృతి చెందింది. యషిక మాత్రం ప్రాణాలతో బయటపడింది.
యషిక ఆనంద్ చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం యషిక డిశ్చార్జ్ అయ్యింది.
అయితే యాషిక డిశ్చార్జ్ తన ఇంటికి వెళ్లకుండా తన ఫ్రెండ్ అయిన ఓ నర్స్ ఇంటికి వెళ్ళింది.
తన ఇంటికి వెళ్తే ప్రమాదంలో చనిపోయిన తన స్నేహితురాలు పావని జ్ఞాపకాలు వెంటాడుతున్నాయట
పావనీ మృతిని తలుచుకొని యాషిక కుమిలిపోతోంది. తాను కూడా చనిపోయింటే బాగుండేదని.. ఇప్పుడు బతికున్న సంతోషంగా లేనంటూ ఎమోషనల్ అయ్యింది.
యాషిక తెలుగు హీరో విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమాలో ఓ పాత్రలో నటించింది.