Chiranjeevi: ఇకపై చూస్తారుగా ఈ చిరు చిందించే రక్తం.. వింటేజ్ మెగాస్టార్ బ్యాక్..

|

Dec 17, 2024 | 11:50 AM

చిరంజీవి అంటేనే మాస్.. ఊర మాస్..! కానీ ఆయనలో ఆ మాస్ యాంగిల్ మాయమై చాలా రోజులైపోయిందని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ఎక్కడో వింటేజ్ మెగాస్టార్ కనిపించట్లేదని తెగ బాధ పడుతున్నారు. అందుకే ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు మెగాస్టార్. ఇకపై చూస్తారుగా ఈ చిరు చిందించే రక్తం అంటూ.. ఏకంగా బ్లడ్ ప్రామిస్ చేసారు. మరి అదేంటో చూద్దామా..?

1 / 5
నిజమే.. మాస్ అంటే అప్పటి జనరేషన్‌కు మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. ఒకప్పుడు ఆయన సినిమాలు మాస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవి. కానీ రీ ఎంట్రీలో మెగా మేనియా అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తుంది.

2 / 5
 రీఎంట్రీ తర్వాత ఖైదీ నెం 150, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలతో చిరు రచ్చ చేసినా.. భారీ అంచనాల మధ్య వచ్చిన కొన్ని సినిమాలు నిరాశ పరిచాయి. దాంతో ఫ్యాన్స్‌కు భారీగా బాకీ పడ్డారు చిరు.

3 / 5
వశిష్టతో ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నా.. అది పూర్తిగా విజువల్ వండర్. ఆ తర్వాత అనిల్ రావిపూడితోనూ ఓ సినిమాకు సైన్ చేసారు మెగాస్టార్. ఇది కూడా యాక్షన్ కమ్ కామెడీతో ఉంటుంది. దాంతో మెగామాస్ పూర్తిగా చూపించే ఛాన్స్ ఏ దర్శకుడు తీసుకోవట్లేదు.

4 / 5
 ఇలాంటి టైమ్‌లో శ్రీకాంత్ ఓదెల సినిమా సైన్ చేసారు చిరు. చిరంజీవి, ఓదెల శ్రీకాంత్ సినిమాకు నాని సమర్పకుడిగా ఉండటం మరో విశేషం. ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనౌన్స్‌మెంట్‌తోనే అర్థమైపోతుంది.

5 / 5
మెగాస్టార్‌లో కొన్నేళ్లుగా నిద్రపోతున్న మాస్‌ను తట్టి లేపుతానని రక్త ప్రమాణం చేసారు శ్రీకాంత్ ఓదెల. నాని కూడా ఫ్యాన్ బాయ్ తాండవం అంటూ పోస్ట్ చేసారు. ఇదంతా చూస్తుంటే చిరు రప్ఫాడించేలాగే కనిపిస్తున్నారు.