Vaishnavi Chaitanya: మరో క్రేజీ ఆఫర్ అందుకున్న వైష్ణవి.. ఆ దర్శకుడితో సినిమా
సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకున్న వైష్ణవి ఇప్పుడు హీరోయిన్ గా మారింది.ఇన్ స్టా రీల్స్, టిక్ టాక్ , యూట్యూబ్ లో వీడియోలతో వైష్ణవి చైతన్య బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా షార్ట్ ఫిలిమ్స్ తో ఈ అమ్మడు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ చిన్నది నటించిన షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ లో మిలియన్ కొద్ది వ్యూస్ రాబట్టాయి. అలాగే షార్ట్ ఫిలిమ్స్ చేస్తూనే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలో బన్నీ సిస్టర్ గా కనిపించింది వైష్ణవి చైతన్య.