
అయితే కబీర్‌సింగ్‌లో హీరో షాహిద్ అని తెలియక ఆ కేరక్టర్‌ని రిజక్ట్ చేశారట మానుషి చిల్లర్. కరెక్ట్ గా ఆ టైమ్‌లోనే ఆమె మిస్ వరల్డ్ అందుకున్నారట. దాంతో ఒన్ ఇయర్ ఆ టీమ్‌తో కాంట్రాక్ట్ లో ఉన్నానని చెప్పారు మానుషి.

టాలీవుడ్‌లో గేమ్ చేంజర్ ఇప్పుడు రామ్ చరణ్ ఒక్కరే కాదు. ఆయనతో పాటు ఇంకొందరు కూడా. వాళ్లు టాలీవుడ్ రేంజ్‌ని పెంచి గ్లోబల్ మార్కెట్‌లో గొప్పగా కూర్చోబెట్టాలంటే, పక్కనున్న గ్లామర్ తారల సపోర్ట్ కంపల్సరీ. ఆ తరహా సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు దీపిక, కియారా, దిశా పాట్ని, జాన్వీ కపూర్.

రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన ‘RC 16’ లో జాయిన్ కానున్నాడు. బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి కథానాయికగా జాన్వీ కపూర్‌ని ఖరారు చేసినట్లు సమాచారం.

యాజ్ ఇట్ ఈజ్‌గా ఆమెలానే ఆలోచిస్తున్నారు దీపిక పదుకోన్, దిశా పాట్ని. డార్లింగ్ హీరోగా చేస్తున్న కల్కిలో వీరిద్దరూ కీ రోల్స్ చేస్తున్నారు. దీపికకు తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ. దిశా ఆల్రెడీ చేసినా మంచి హిట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

దిశాకి సౌత్‌లో హిట్ మస్ట్. అలాగే కియారా అద్వానీ కి కూడా మాంచి సక్సెస్ మూవీ కావాలి. ఆల్రెడీ ఆమె రామ్‌చరణ్‌తో చేసిన వినయవిధేయ రామా ఆడలేదు. అయినా, సెంటిమెంట్ పట్టించుకోకుండా గేమ్ చేంజర్ ఆఫర్ చేశారు శంకర్. ఈ సారైనా స్క్రీన్ మీద అదుర్స్ అనిపించే హిట్ అందుకోవాలన్న తపన కనిపిస్తోంది కియారాలో.