
ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల రాశీ. తొలి సినిమాతోనే తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. బబ్లీ బబ్లీ లుక్ లో భలే ఉందే ఈ అమ్మాయి అంటూ కుర్రాళ్లంతా రాశీ అందానికి ఫిదా అయ్యారు.

తొలి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. మీడియా రేంజ్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అలాగే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది. ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా చేసింది.

తెలుగుతో పాటు బాలీవుడ్ పై కూడా ఫోకస్ చేసింది ఈ వయ్యారి.. బాలీవుడ్ లో సినిమాలు సిరీస్ లు చేసింది ఈ అమ్మడు. వీటితో పాటు తమిళ్ లోనూ ఆఫర్స్ అందుకుంది. రాశీ ఖన్నా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవలే సిద్దూ జొన్నల గడ్డ హీరోగా నటించిన తెలుసు కదా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనూ నటిస్తుంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉంటే రాశీ ఖన్నా ఇప్పుడు మరో బడా హీరో సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత చిరంజీవి బాబీ కలిసి చేస్తున్న సినిమా ఇది.