
సోషల్ మీడియా సైతం ఈ అమ్మడి ఫాలోయింగ్ అమాంతం పెరిగింది.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మమితాకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

హీరోయిన్ మమితా బైజు అందానికి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కేరళలోని కొట్టాయం జిల్లా కిడంగూర్‌లో ఆమె డా.బైజు కృష్ణన్, మినీ బైజు దంపతులకు జన్మించింది. ఆమెకు మిధున్ బైజు అనే అన్నయ్య ఉన్నాడు

షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది మమిత.. ఆతర్వాత సినిమాల్లోకి వచ్చింది. ఇక ఇప్పుడు ప్రేమలు సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది.

తెలుగులో ఓ యంగ్ హీరో సినిమాలో మమితా బైజు నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఓ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కే సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని త్వరలోనే అప్డేట్ రానుందని టాక్.

ప్రస్తుతం రెబల్ అనే తమిళ్ సినిమాలో నటిస్తుంది మమితా బైజు. త్వరలోనే ఈ అమ్మడు స్ట్రయిట్ గా తెలుగులో అడుగు పెడుతుందని టాక్ రావడంతో ఈ అమ్మడి అభిమానులు ఖుష్ అవుతున్నారు.