మీనాక్షీ చౌదరి.. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందం అభినయం కలగలిపిన ఈ చిన్నది. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయ్యింది మీనాక్షి
ఆతర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడీ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాలో తన నటనతో పాటు అందాలతో కూడా ఆకట్టుకుంది. ఖిలాడీ సినిమాలో తన గ్లామర్ తో కట్టిపడేసింది. ఈ సినిమా హిట్ కాకపోవడంతో అమ్మడికి అవకాశాలు రాలేదు.
ఆతర్వాత హిట్ 2లో నటించింది. ఈ సినిమా సక్సెస్ అయ్యిందికాని క్రెడిట్ అడవి శేష్ కు వెళ్ళింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఓ బంపర్ ఆఫర్ ను అందుకుంది సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ అందుకుంది మీనాక్షి చౌదరి.
మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి నటిస్తుంది. ఇక ఇప్పుడు మరో క్రేజీ అఫర్ అందుకుందని తెలుస్తోంది.
ప్రస్తుతం , వరుణ్‌తేజ్ ‘మట్కా’, విశ్వక్ సేన్ ల సినిమాల్లో నటిస్తుంది. ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది. దుల్కర్ హీరోగా నటిస్తున్న లక్కీభాస్కర్ అనే సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి ఎంపిక అయ్యిందని తెలుస్తోంది.