Rajeev Rayala |
Mar 09, 2022 | 7:15 AM
దళపతి విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమా లో హీరోయిన్ గా మాళవిక మోహనన్ కు మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తమిళంలో ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటుంది. ఈ అమ్మడికిటాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వాలనే ఆసక్తి ఉందట. కాని తెలుగు లో మాత్రం సరైన ఆఫర్ రాలేదు.
విజయ్ దేవరకొండ తో ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కాని ఆ సినిమా ఆరంభం కాకుండానే క్యాన్సిల్ అయ్యింది.
ప్రభాస్ కు జోడీగా ఈమె రాజా డీలక్స్ సినిమా లో మారుతి దర్శకత్వంలో నటించబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.
తెలుగులో తాను ఒక సినిమాను చేయబోతున్నాను. అది ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా. నాకు తెలుగు లో ఒక మంచి ఎంట్రీ ఆ సినిమా తోనే అని చెప్పుకొచ్చింది మాళవిక
ఈ అమ్మడు తెలుగు లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన సినిమా ప్రభాస్ తోనే అయ్యి ఉంటుందని అంటున్నారు అభిమానులు.