Indan 2: భారతీయుడు ఈజ్ బ్యాక్.. మళ్ళీ రికార్డ్స్ తిరగరాసేనా

| Edited By: Phani CH

Nov 04, 2023 | 9:22 PM

పాతికేళ్ల పైనే అయింది భారతీయుడు సినిమా వచ్చి..! అప్పటి పరిస్థితులకి తగ్గట్లుగా శంకర్ తెరకెక్కించిన భారతీయుడు అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. మరి ఇప్పటికీ భారతీయుడులో అదే కసి ఉందా..? అంతే సత్తా ఉందా..? సీక్వెల్‌లో ఏ పాయింట్‌ని శంకర్ హైలైట్ చేస్తున్నారు..? తాజాగా విడుదలైన భారతీయుడు 2 టీజర్ అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చింది. భారతీయుడు 2 అనౌన్స్ చేసినప్పటి నుంచి కమల్ హాసన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్ కూడా ఎలా ఉంటుందా అనే ఆసక్తితో ఉన్నారు.

1 / 5
పాతికేళ్ల పైనే అయింది భారతీయుడు సినిమా వచ్చి..! అప్పటి పరిస్థితులకి తగ్గట్లుగా శంకర్ తెరకెక్కించిన భారతీయుడు అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. మరి ఇప్పటికీ భారతీయుడులో అదే కసి ఉందా..? అంతే సత్తా ఉందా..? సీక్వెల్‌లో ఏ పాయింట్‌ని శంకర్ హైలైట్ చేస్తున్నారు..? తాజాగా విడుదలైన భారతీయుడు 2 టీజర్ అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చింది.

2 / 5
భారతీయుడు 2 అనౌన్స్ చేసినప్పటి నుంచి కమల్ హాసన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్ కూడా ఎలా ఉంటుందా అనే ఆసక్తితో ఉన్నారు. పైగా షూటింగ్ మొదలు పెట్టిన అనుకోని కారణాలతో రెండేళ్లకు పైగా సినిమా ఆగిపోవడం.. శంకర్ దాన్ని మళ్లీ పట్టాలెక్కించడం అన్నీ మరింత ఇంట్రెస్ట్‌ను పెంచేసాయి. తాజాగా టీజర్ చూస్తుంటే పాతికేళ్ళ నాటి శంకర్ గుర్తుకొస్తున్నారు.

3 / 5
భారతీయుడు పూర్తిగా లంచం నేపథ్యంలో తెరకెక్కించారు శంకర్. అప్పట్లో అది బాగా కనెక్ట్ అయింది. అయితే పాతికేళ్ళ తర్వాత కూడా సేమ్ టాపిక్ మళ్లీ తీసుకున్నారు ఈ దర్శకుడు. ఇప్పుడు ఖర్చులు పెరిగాయి కాబట్టి లంచం రేంజ్ లెక్క కూడా పెరిగింది. ఇదే టీజర్‌లోనూ చూపించారు శంకర్. సిద్ధార్థ్, రకుల్, ప్రియా భవాని శంకర్, వివేక్, బాబీ సింహా ఇలా అందరి పాత్రలను పరిచయం చేసారు.

4 / 5
ఇది శంకర్ మార్క్ అని చెప్పుకోడానికి కొత్తగా టీజర్‌లో ఏం లేదు.. కాకపోతే మళ్లీ అదే గ్రాండియర్ కనిపించింది. టీజర్ కోసమే కోట్లు ఖర్చు చేసినట్లు అర్థమవుతుంది. కారెక్టర్ ఇంట్రోలోనే ఇది కూడా లంచం చుట్టూ తిరిగే కథ అని చెప్పారు శంకర్.

5 / 5
దీన్ని నేటి తరానికి తగ్గట్లు ఎంత బాగా తెరకెక్కిస్తారనేది భారతీయుడు ఫ్యూచర్‌ను డిసైడ్ చేయనుంది. చివర్లో కమల్ హాసన్ కనిపించారు.. ఏమాటకామాటే పాతికేళ్లైంది కదా.. అందుకే సేనాపతి మరింత ఓల్డ్ అయిపోయారు.