
టాలీవుడ్ లో తన అందంతో కుర్రకారు గుండెల్లో బాణాలు గుచ్చిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. వారిలో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ అమ్మడు.

తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ సినిమా ఫ్లాప్ అయినా.. ఈ అమ్మడి అందానికి మంచి మార్కులు పడ్డాయి. ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది ఈ అందాల భామ. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం సాధించలేదు.

ఆతర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కింగ్‌డమ్ అనే సినిమా చేసింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడులైంది కానీ సినిమాకు అంతగా ఆదరణ లభించలేదు. అయినా కూడా ఈ అమ్మడికి ఆఫర్స్ మాత్రం తగ్గలేదు. ఆవెంటనే రామ్ పోతినేని సినిమాలో ఛాన్స్ అందుకుంది.

యంగ్ హీరో రామ్ పోతినేనితో కలిసి ఆంధ్రా కింగ్ తాలూకా అనే సినిమా చేసింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ తన అందంతో ఆకట్టుకుంది. ఆతర్వాత దుల్కర్ సల్మాన్‌తో తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం కాంతలో నటించి మెప్పించింది ఈ వయ్యారి భామ.

ఇప్పుడు ఈ అమ్మడు తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమాలో ఛాన్స్ అందుకుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.