Nayanthara : నయనతారకు అందుకే అంత డిమాండ్.. ఆమె తప్ప మరో ఆప్షన్ లేదు మరి..!

Edited By:

Updated on: Nov 19, 2025 | 10:13 PM

నయనతార.. ఈ పేరు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో ఒక సంచలనం. కేవలం దక్షిణాదిలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ లేడీ సూపర్ స్టార్.. తన కెరీర్‌లో ఒక పీక్ చూస్తుందిప్పుడు. ప్రత్యేకించి సీనియర్ హీరోలకు జోడీగా నటించడంలో ఆమెకు తిరుగులేదనే చెప్పాలి. ఒకప్పుడు సీనియర్ హీరోలు కొత్త హీరోయిన్లతో జత కట్టేవాళ్లు.. కానీ ఇప్పుడు వాళ్ళ కెరీర్ గ్రాఫ్, వాళ్ళ వయసుకు తగ్గ జోడీగా నయనతార మాత్రమే ఏకైక ఆప్షన్‌గా మారిపోయింది.

1 / 7

2 / 7
ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, అనుభవం, స్టార్‌డమ్ సీనియర్ హీరోల పక్కన పర్ఫెక్ట్‌గా సెట్ అవుతున్నాయి. ఈ డిమాండ్‌తోనే ఆమె పారితోషికం కూడా ఆకాశాన్ని అంటింది. తెలుగు ఇండస్ట్రీ విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవితో వరస సినిమాలు చేస్తుంది. సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ తర్వాత.. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకరవరప్రసాద్ గారూ సినిమాలో చిరంజీవితో మరోసారి జోడీ కడుతుంది.

3 / 7
ఇది సెట్స్‌పై ఉండగానే.. నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోయే సినిమాలో కూడా నయనతార పేరు ఖరారైంది. పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రం ట్రెండ్ ఫాలో అవుతూ మరోసారి నయనతారనే హీరోయిన్‌గా తీసుకున్నారు మేకర్స్. 60 ప్లస్ హీరోలకు కూడా నయనతార తప్ప మరో హీరోయిన్ జోడీగా సెట్ అవ్వట్లేదు. ఒకే హీరోతో మూడు, నాలుగు సార్లు జత కట్టడానికి నిర్మాతలు, దర్శకులు కూడా ఏమాత్రం వెనుకాడటం లేదు.

4 / 7
బాలయ్యతో ఇప్పటికే సింహా, జై సింహా, శ్రీ రామరాజ్యం సినిమాల్లో నటించింది నయనతార. తమిళం, మలయాళ ఇండస్ట్రీలలో కూడా ఆమెదే పైచేయి. తమిళంలో స్టార్ హీరో అజిత్‌తో ఆమె కాంబినేషన్ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇక మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి దిగ్గజ నటులకు కూడా బెస్ట్ ఆప్షన్ నయనతారే.

5 / 7
వాళ్ళ చిత్రాలలో ఆమె నటనకు, స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ సీనియర్ హీరోలందరికీ ఆమె ఒక పర్ఫెక్ట్ మ్యాచ్‌గా నిలవడానికి ముఖ్య కారణం.. పాత్రలను ఎంచుకునే విధానం, ఆమె పర్సనాలిటీ. ఆ పాత్రలకు తగ్గట్టుగా తనను తాను మేకోవర్ చేసుకుంటుంది ఈ బ్యూటీ. అందుకే ఆమె దక్షిణాదిన కదిలించలేని కోట కట్టేసుకుంది. సీనియర్ హీరోల చిత్రాలతో పాటు.. నయనతారకు మరో అరుదైన ఘనత ఉంది.

6 / 7
ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా కేరాఫ్ అడ్రస్. ఈ సినిమాలలో ఆమె తన పారితోషికాన్ని కూడా త్యాగం చేసి నటించడం.. మరోవైపు కమర్షియల్ సినిమాల్లో ముక్కుపిండి మరీ రెమ్యునరేషన్ వసూలు చేయడం నయన్ స్టైల్. ఇదే ఆమె స్టార్‌డమ్‌ను మరింత పెంచుతున్నాయి.

7 / 7
ఒకవైపు పెద్ద పెద్ద సూపర్ స్టార్స్‌తో నటిస్తూనే, మరోవైపు కేవలం తన ఇమేజ్‌తో సినిమాను నడిపించగల సత్తా ఉన్న అతి కొద్ది మంది హీరోయిన్లలో నయనతార ముందు వరుసలో ఉంటుంది. ఇండస్ట్రీలో డిమాండ్‌ను బట్టే పారితోషికం ఉంటుంది. నయనతారకు ఈ స్థాయిలో డిమాండ్ ఉండటం వల్లే, ఆమె ఒక సినిమాకు సుమారు 15 కోట్ల రూపాయల వరకు తీసుకుంటుంది. సీనియర్ హీరోలకు ఆమె మాత్రమే బెస్ట్ జోడీగా ఉండటం, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను తన భుజాలపై మోయగలగడంతో నయన్ అడిగినంత ఇచ్చేస్తున్నారు నిర్మాతలు.