
కల్కి సినిమా సక్సెస్‌ని స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు దిశా పటాని. ఎప్పటి నుంచో సౌత్ ఆడియన్స్‌కి దగ్గర కావాలని ట్రై చేసిన ఈ బ్యూటీ ఏకంగా డార్లింగ్ సినిమాతోనే అనుకున్నది సాధించారు. కల్కి2 కోసం దిశ మాత్రమే కాదు దీపిక కూడా వెయిటింగ్.

పోస్ట్ డెలివరీ దీపిక ముందు అడుగుపెట్టేది షారుఖ్ సెట్స్‌లోనే. ఆ వెంటనే కల్కి సెట్స్‌కి ఎంట్రీ ఇచ్చేస్తారు. కల్కి 2 షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. అయితే ఎప్పుడు అన్నది ఎలాంటి స్పష్టత లేదనే చెప్పాలి.

ఆ టైమ్‌కి జాన్వీ కపూర్ కూడా దేవర సెట్స్ లో ఉంటారు. తారక్‌తో కలిసి స్టెప్పులేయడానికి రెడీ అవుతుంటారు. ఫస్ట్ పార్టులో జాన్వీకి పెద్దగా ఇంపార్టెన్స్ లేదనే మాటలు వినిపించాయి. సెకండ్ పార్టులో దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారట కొరటాల.

సలార్ సీక్వెల్ కోసం శ్రుతిహాసన్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాతో ప్రశాంత్ బిజీగా ఉన్నారు. డార్లింగ్ రాజాసాబ్ మూవీతో హను రాఘవపూడి సినిమాలు చేస్తున్నారు. వీటి తర్వాత స్పిరిట్, కల్కి 2 పుర్తి చెయ్యాలి. దీని బట్టి సలార్ సీక్వెల్ టైం పట్టేలా కనిపిస్తుంది.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ పార్క్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు రష్మిక అండ్ త్రిప్తి దిమ్రి. అయితే దీని కంటే ముందు ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీ కంప్లీట్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు సందీప్.