
డార్లింగ్ సర్జరీ సంగతులేంటి? ఇప్పుడెలా ఉన్నారు? ఇండియాకి ఎప్పుడొస్తారు? వచ్చాక ఏం చేస్తారు?.. ఎక్సట్రా ఎక్సట్రా డీటైల్స్ తో పాటు, ప్రభాస్ హెల్త్ సిట్చువేషన్ గురించి ఎక్స్ క్లూజివ్‌గా మాట్లాడుకుందాం... రండి!

లార్ వాయిదా పడింది. సలార్‌ని నవంబర్‌లో రిలీజ్ చేస్తారా? డిసెంబర్‌లో చేస్తారా? ఫ్రెష్‌గా పొంగల్ బరిలో దింపుతారా? వంటివన్నీ ఓల్డ్ టాపిక్స్. ఇప్పుడు రెబల్ సైన్యానికి ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం ఒక్కటే. ఫారిన్ వెళ్లిన ప్రభాస్‌కి సర్జరీ జరిగిందా? లేదా? అన్నది. సలార్ టాపిక్ పక్కకెళ్లి, సర్జరీ న్యూస్ మెయిన్‌లోకి వచ్చేసింది.

ప్రభాస్‌కి సర్జరీ కంప్లీట్ అయింది. ఆయన ప్రస్తుతం అక్కడ హాస్పిటల్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు. అక్టోబర్ 15 తర్వాత ఇండియాకి రావాలన్నది ప్లాన్. వచ్చాక ఇక్కడ కూడా పదిహేను రోజుల పాటు రెస్ట్ తీసుకుంటారు ప్రభాస్. ఆ తర్వాత ఆయన ఏ షూటింగ్‌కి హాజరవుతారనే క్యూరియాసిటీ కంటిన్యూ అవుతోంది.

అక్టోబర్ ఎండింగ్‌కి సలార్ రిలీజ్ మీద క్లారిటీ వస్తే, ఆ సినిమా ప్రమోషన్లలో పార్టిసిపేట్ చేస్తారనేది టాక్. ఒకవేళ సలార్ విషయంలో సస్పెన్స్ కంటిన్యూ అయితే, కల్కి షూటింగ్‌కి హాజరవుతారా అనే క్యూరియాసిటీ కూడా మరోవైపు క్రియేటవుతోంది.

కల్కి ఫస్ట్ పార్ట్, సలార్ రిలీజుల గురించి మాత్రమే కాదు, మారుతి సినిమా పరిస్థితి ఏంటి? ఆ తర్వాత సందీప్‌రెడ్డి వంగా సినిమా సంగతులేంటనే డిస్కషన్ కూడా జరుగుతోంది. ప్రస్తుతం సినిమాలకూ, షూటింగులకు దూరంగా హెల్త్ మీద కాన్‌సెన్‌ట్రేషన్ చేస్తున్న ప్రభాస్ హైదరాబాద్‌లో ల్యాండ్ అయితే గానీ, ఈ డౌట్స్ అన్నీ క్లియర్ కావన్నమాట.