
సంక్రాంతికి ఎప్పట్లాగే భారీ పోటీ ఉంది. అందులో గేమ్ ఛేంజర్ అంటూ రామ్ చరణ్ వస్తుంటే.. డాకూ మహరాజ్ అంటూ బాలయ్య బరిలోకి దిగుతున్నారు. ఈ ఇద్దరితో పాటు నేనున్నానంటూ సంక్రాంతికి వస్తున్నారు వెంకీ. అనిల్ రావిపూడి దర్శకుడు కావడంతో సంక్రాంతికి వస్తున్నాంపై అంచనాలు బాగానే ఉన్నాయి.

ఈ సారి పండగ మామూలుగా కనిపించట్లేదు. ప్రమోషన్స్ విషయంలో కూడా ఎవ్వరు తగ్గదేలే అంటున్నారు. మరి ప్రమోషన్స్ పర్వాన్ని ఎవరు ఎలా మొదలుపెడుతున్నారు.? ఎక్కడ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నరు.

ఈ క్రమంలోనే అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేస్తున్నారు. మరి అవేంటి..? ఇంతకీ గేమ్ ఛేంజర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి..? గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌లో జోరు పెరుగుతుంది.

గేమ్ ఛేంజర్‌కు పోటీగా బాలయ్య, వెంకీ కూడా దూకుడు చూపిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం విషయంలో అనిల్ రావిపూడి అస్సలు తగ్గట్లేదు. రమణ గోగులతో పాడించిన ఫస్ట్ సింగిల్ అదిరిపోయింది. ఇటీవల వచ్చిన రెండో రెండో పాట ఆకట్టుకుంది. తాజాగా మూడో పాట అప్డేట్ కూడా వచ్చింది. ఇది త్వరలో రానుంది.

Sankranthiki Vasthunnam Review