
నిన్నటిదాకా ఆ ఎదురుచూపులు అక్కినేని ఫ్యామిలీలో ఉండేవి. ఇవాళ అవి మెగా ఫ్యామిలీకి కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. ఒక్క హిట్ అంటూ ఎదురుచూస్తున్నారు మెగా హీరోలు. ఇప్పట్లో అయితే సాలిడ్ హిట్ పడే అవకాశాలు కనిపించడం లేదు.. మరి ఈ పరిస్థితిని ఓవర్‌కమ్ చేసేదెవరు?

2023 స్టార్టింగ్‌లో వేర్ ఈజ్ ద పార్టీ అనే వైబ్స్ బాగానే కనిపించాయి మెగా ఫ్యామిలీలో. ఆ సినిమాలో మెగాస్టార్ మాత్రమే కాదు, మాస్ మహరాజ్ రవితేజ కూడా యాక్ట్ చేశారు. సక్సెస్‌లో ఇద్దరు హీరోలకూ షేర్ ఉంది.

ఈ సినిమా తర్వాత మాంచి ఎక్స్ పెక్టేషన్స్ తో విడుదలైంది బ్రో మూవీ. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయితేజ్ కలిసి చేసిన సినిమా బ్రో. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన మూవీ, ఇక్కడ మాత్రం అస్సలు మెప్పించలేకపోయింది.చిన మామ పవన్ కల్యాణ్, మేనల్లుడు సాయితేజ్ హిట్ చూడలేకపోయారు.

చిన మామ పవన్ కల్యాణ్, మేనల్లుడు సాయితేజ్ హిట్ చూడలేకపోయారు. మరి పెద్దమావయ్య చిరంజీవి భోళా శంకర్‌తో బంపర్ హిట్ ఇస్తారని అనుకున్నారు. అయితే మార్నింగ్ షోకే పెదవి విరిచేశారు ఫ్యాన్స్. ఇదేం సినిమారా బాబూ.. అసలు బాస్ ఈ కథని ఎందుకు సెలక్ట్ చేసుకున్నారని ఓపెన్‌గానే అనేశారు.

పెదనాన్న భోళా శంకర్ పోయినా, కాబోయే పెళ్లికొడుకు గాండీవధారి అర్జునతో అయినా ఫ్యామిలీకి ఒక్క హిట్ ఇస్తారని ఆశించారు జనాలు. ఆశలన్నీ అడియాసలైపోయాయి. టిక్కెట్‌కి పెట్టిన డబ్బు వేస్ట్ అని నిర్దారించేశారు సినిమా చూసిన వారు.

ఇప్పట్లో అయితే మెగా ఫ్యామిలీ నుంచి చెప్పుకోదగ్గర సినిమాలు లేవు. మరి ఈ సంప్‌లో నుంచి బయటపడి నెక్స్ట్ హిట్ ఇచ్చేదెవరనే చర్చ మాత్రం జరుగుతోంది.