
కెరీర్ బాగా ఫార్మ్ లో ఉన్నప్పుడు అవకాశాలను అందిపుచ్చుకోకుండా తప్పు చేశారని అనుకోవాలా.? లేకుంటే ఒక్కడుగు వెనక్కి వేసింది.. పదడుగులు ముందుకు దూకడానికే.. సరైన పనే చేశారని మెచ్చుకోవాలా?

శ్రీలీల కెరీర్ గురించి విశ్లేషించాలనుకునేవారికి ఇప్పుడు ఇదో రకం డైలమా. శ్రీలీల ఎందుకు సైలెంట్‌గా ఉన్నారన్నది చాలా మందికి అంతుబట్టని ప్రశ్న.

కావాలనే ఇలా చేయడం ఏమీ బాగా లేదని బెంగ పెట్టుకున్న ఫ్యాన్స్ కూడా లేకపోలేదు. అయినా ఫికర్ చేయడం లేదు శ్రీలీల. నేనో నిర్ణయం తీసుకున్నానంటే దాని వెనుక పెద్ద స్కెచ్చే ఉంటుందని చెప్పకనే చెబుతున్నారు.

నార్త్ లో సిద్ధార్థ్ మల్హోత్రతో జోడీ కట్టబోతున్నారు శ్రీలీల. అక్టోబర్ నుంచి ఈ సినిమాకు కాల్షీట్లు కేటాయించారట. మిట్టి సినిమా కోసం ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయిందట.

బాలీవుడ్‌లో ఫస్ట్ వెంచర్ బావుండాలంటే కాస్త్ ప్రిపరేషన్ అవసరమని, టాలీవుడ్‌కి బ్రేక్ ఇచ్చారట శ్రీలీల. ఆ మధ్య విజయ్ మూవీ గోట్‌లో స్పెషల్ సాంగ్‌లో చేయమన్నారట శ్రీలీలను. రీసెంట్‌గా విశ్వంభర కోసం కూడా అడిగినట్టు వార్తలొచ్చాయి.

అయితే స్పెషల్ సాంగులు చేయడానికి ఇష్టపడటం లేదట శ్రీలీల. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగులోనూ రెండు మూడు సినిమాలున్నాయి.

ఇవి పూర్తయ్యాక కంప్లీట్‌గా బాలీవుడ్ మీదే ఫోకస్ చేస్తారా? లేకుంటే రష్మికలాగా నార్త్ అండ్ సౌత్‌ని కవర్ చేస్తారా అనేది తెలియాలంటే మిట్టి రిజల్ట్ వచ్చేవరకూ ఆగాల్సిందే.