
నేనిప్పటిదాకా ఇంత టెక్నికల్ మూవీని చూడలేదు అని బిగ్ బీ అమితాబ్ లాంటి లెజెండ్ స్టేట్‌మెంట్ ఇచ్చారంటేనే కల్కి 2898ఏడీని నాగ్ అశ్విన్ ఏ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

గతాన్ని భవిష్యత్తుని లింకు చేస్తూ ఫ్యూచరిస్టిక్ సినిమాగా రూపొందిస్తున్నారు కల్కి చిత్రాన్ని. జూన్ 27 ఎప్పుడెప్పుడు వస్తుందా? సినిమా ఎలా ఉండబోతోందా అని వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు జనాలు.

మెదడులో చిప్ పెట్టడం, మరొకరి తాలూకు జ్ఞాపకాలను ఇంజెక్ట్ చేయడం అనే కాన్సెప్టుతో విడుదలైంది ఇస్మార్ట్ శంకర్. వినడానికే కొత్తగా ఉండటంతో వెంటనే యాక్సెప్ట్ చేసేశారు జనాలు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ కి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కుతోంది. ఆ మధ్య కాస్త నెమ్మదిగా కదిలిన ప్రాజెక్టు... ఈ మధ్య డబుల్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. పూరి జగన్నాథ్‌కి, రామ్‌కీ ఈ సినిమా హిట్ చాలా ఇంపార్టెంట్.

సూపర్ పవర్ ఉన్న ఓ విలన్‌తో సామాన్యుడు చేసే పోరాటం నేపథ్యంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్ సినిమా మాయవన్. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ సన్నివేశాలు కూడా సినిమాలో కీలకం. ప్రస్తుతం హైదరాబాద్‌లో మాయవన్ షూటింగ్ జరుగుతోంది.

తేజ సజ్జా నటిస్తున్న సినిమా మిరాయ్. సూపర్ యోధ కాన్సెప్టెతో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా సైన్స్ ఫిక్షన్ జోనర్‌లోకే వస్తుంది. కాన్సెప్ట్ వీడియోతోనే జనాల్లో ఆసక్తి రేకెత్తించింది మిరాయ్. సూపర్ హీరోగా తేజ సజ్జా ఎలా మెప్పిస్తారోనన్న ఆసక్తి బాగా కనిపిస్తోంది.