విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లైలా’. ఆకాంక్ష శర్మ ఇందులో హీరోయిన్. ఈ సినిమా కోసం తొలిసారి లేడీ గెటప్ విశ్వక్. ఈ మూవీ ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
ఆర్.వి.ఎస్.నిఖిల్ దర్శకత్వంలో బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ తాత-మనవళ్లుగా నటించిన సినిమా ‘బ్రహ్మా ఆనందం’. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిశోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది.
విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా చిత్రం ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా కెరీర్ స్టార్టింగ్‌లో నటించిన చిత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’. రవికాంత్ పేరేపు దర్శత్వంలో రానా దగ్గుబాటి సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్‌లో రూపొందింది. శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినీ కథానాయికలుగా నటించిన విభిన్న ప్రేమకథా చిత్రంగా 2020లో కరోనా లాక్ డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలై యువతను మెప్పించింది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజును పురస్కరించుకొని ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ పేరుతో ఈ చిత్రన్నీ థియేటర్లలో విడుదల చేయనున్నారు మేకర్స్.
‘రణం’తో సత్తా చాటిన అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘తల’. అయన తనయుడు రాగిన్ రాజ్‌ను హీరోగా పరిచయం చేస్తున్న ఈ మూవీలో అంకిత నస్కర్, ఎస్తేర్, అవినాష్, సత్యం రాజేశ్, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 14న విడుదల ప్రేక్షకులను అలరించనుంది.