యస్.. ది సందీప్ వంగా అర్జున్‌రెడ్డి ఫుల్ కట్‌ని పదో వార్షికోత్సవానికైనా విడుదల చేయండి అంటూ విజయ్ దేవరకొండ పెట్టిన పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. రిలీజ్ అయిన అర్జున్‌రెడ్డిని చూసే చాలా మంది అప్పట్లో గగ్గోలు పెట్టారు.
ఆల్రెడీ ఎనౌన్స్ అయిన సినిమాల విషయంలో డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నారు. ప్రజెంట్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు విజయ్ దేవరకొండ. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనిపించబోతున్నారు వీడి.
ఆ ట్వీట్ వైరల్ కావడానికి ఇదొక్కటే కారణం కాదు.. అంతకు మించిన న్యూస్ ఉంది.. ఇంతకీ ఆ విషయాన్నీ మీరూ గమనించారా.?
రవి కిరణ్ కోల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోస్తా ఆంధ్రా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ కాల్ ఇచ్చిన మేకర్స్, గోదారి యాసలో మాట్లాడగలిగిన వాళ్లకు స్పెషల్ ప్రియారిటీ ఉంటుంది చెప్పారు.
ఇంత బోల్డ్ కంటెంట్ ఏంటి బాసూ అంటూ బాలీవుడ్ కబీర్ సింగ్‌ని చూసిన వారు కూడా రియాక్ట్ అయ్యారు. ఏడేళ్ల క్రితం అర్జున్‌రెడ్డి తీసిన సందీప్‌కీ, రీసెంట్‌గా యానిమల్ తీసిన సందీప్‌కీ ఏమాత్రం మార్పు లేదు.
రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అంటే ఈ సినిమాలో సీమ పౌరుష్ చూపించబోతున్నారు రౌడీ హీరో.
తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ ఇప్పుడు కోస్తా ఆంధ్రా, రాయలసీమ కుర్రాడిగా నటించేందుకు రెడీ అవుతున్నారు.