మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం ఇవాళ (జూన్9) జరగనుంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని వరుణ్ తేజ్ ఇంట్లో వీరిద్దరి నిశ్చితార్థ వేడుక జరగనుంది.
త్యంత సన్నిహితులు, ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వరుణ్- లావణ్యల ఎంగేజ్మెంట్ వేడుక జరగనుంది. అలాగే కొంత మంది సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించినట్లు సమాచారం.
ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్‌లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ వరుణ్ ఎంగేజ్‌మెంట్ వేడుకకు హాజరకానున్నారని తెలుస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసనలతో పాటు మెగా, అల్లు కుటుంబ సభ్యులు ఈ నిశ్చితార్థంలో పాల్గొంటారు.
కాగా వరుణ్ సోదరి నిహారిక, లావణ్య బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి జిమ్ చేసేవారు. అలా నిహారిక ద్వారా వరుణ్-లావణ్య ఒకరికొకరు పరిచయమయ్యారని తెలుస్తోంది. అలా కలిసి సినిమాల్లో నటించక ముందే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది.
ఇక వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి 'మిస్టర్', 'అంతరిక్షం' సినిమాల్లో నటించారు. కాగా నాగబాబు చెప్పిన మాటల ప్రకారం చూస్తే ఈ ఏడాదిలోనే వరుణ్-లావణ్యల పెళ్లి ఉంటుందని తెలుస్తోంది.