
ఒళ్ళు హూనమైపోయిందిరా బాబూ అంటారు కదా..! ఇప్పుడు సమంతను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది పాపం. సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం ఈమె పడిన కష్టం చూస్తుంటే వామ్మో అనుకోవాల్సిందే. ట్రైలర్‌తోనే యాక్షన్ క్వీన్‌గా మారిపోయారు ఈ బ్యూటీ. మరి మొత్తం సిరీస్ చూస్తే ఏమైపోతారో..? ముందైతే ట్రైలర్ రివ్యూ చూద్దాం పదండి..

కారణాలేవైనా కావచ్చు కానీ కొన్ని నెలలుగా స్క్రీన్‌కు దూరంగానే ఉన్నారు సమంత. ఆమె నుంచి సినిమాలు గానీ.. సిరీస్‌లు గానీ ఏం రాలేదు. ప్రస్తుతం ఈమె కెరీర్ సిటాడెల్ వెబ్ సిరీస్‌పైనే ఆధారపడి ఉంది. ఈ వెబ్ సిరీస్ కోసం ప్రాణం పెట్టేసారు ఈ బ్యూటీ.

తాజాగా విడుదలైన ట్రైలర్ చూసాక.. స్యామ్ కష్టం కళ్ళ ముందు కనిపిస్తుంది. చూస్తున్నారుగా.. ఇందులో సమంత స్టంట్స్ చూసాక.. యాక్షన్ క్వీన్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నారేమో అనిపించక మానదు. అంతగా రెచ్చిపోయారు ఈ భామ.

హాలీవుడ్ సిరీస్ సిటాడెల్‌కు ఇండియన్ వర్షన్ అయినా కూడా.. ఎక్కడా ఆ ఛాయలైతే కనిపించలేదు. ఎందుకంటే ఆ సిటాడెల్‌లో యాక్షన్‌తో పాటు రొమాన్స్ ఎక్కువగానే ఉంటుంది.. ఇందులో అది కనబడలేదు.

వరుణ్ ధావన్, సమంత జంటగా నటిస్తున్న సిటాడెల్ నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజీగా రాజీ లేకుండా నటించారు స్యామ్. ఇప్పుడు సిటాడెల్‌లో మరింత రెచ్చిపోయారు. ఈ సిరీస్ విడుదలయ్యాక.. అమ్మడి అడ్రస్ పూర్తిగా కేరాఫ్ ముంబై అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలిక.. ఏం జరుగుతుందో..?