ఒరిజినల్ లొకేషన్స్ కంటే ఇప్పుడు సెట్స్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు మన దర్శకులు. మనం ఫారెన్ వెళ్లడం ఏంటి..? ఫారెన్‌నే ఇక్కడికి తీసుకొస్తే అయిపోతుంది కదా అంటున్నారు. మరోవైపు ఏకంగా దేశాల సెట్ కూడా వేస్తున్నారు. తాజాగా మరో సినిమా కోసం ఓ భారీ సెట్ నిర్మాణం జరుగుతుంది. అదిప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
ఒకప్పుడు సినిమాకు సెట్ వేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించేవాళ్లు.. కానీ ఇప్పుడలా కాదు.. చెప్పులేసుకున్నంత ఈజీగా సెట్స్ వేస్తున్నారు. అంతేకాదు సినిమా అంతా అక్కడే తీస్తున్నారు కూడా. రంగస్థలం అయినా.. ఆచార్య అయినా.. బాహుబలి అయినా సినిమా అంతా తీసింది సెట్స్‌లోనే. ఒక్కో సెట్ కోసం 20 నుంచి 30 కోట్ల వరకు ఖర్చ చేస్తున్నారు నిర్మాతలు.
తాజాగా రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా కోసం భారీ సెట్ నిర్మాణం జరుగుతుంది. రంగస్థలం మాదిరే.. ఓ భారీ విలేజ్ సెట్ వేస్తున్నారు. అందులోనే దాదాపు 60 శాతం షూటింగ్ చేయాలని ప్లాన చేసారు బుచ్చిబాబు. గేమ్ ఛేంజర్ పూర్తి కాగానే.. జూన్ రెండో వారం నుంచి RC16 మొదలు కానుంది. ఈ సెట్ కోసమే దాదాపు 25 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది.
పుష్ప 2 కోసం RFCలోనే మలేషియా సెట్ వేసారు. అక్కడే కీ సీన్స్ చిత్రీకరిస్తున్నారు సుకుమార్. మరోవైపు రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ కోసం అల్యూమీనియం ఫ్యాక్టరీలో భారీ సెట్ నిర్మాణం జరుగుతుంది.
విశ్వంభరలో దాదాపు 70 శాతం సీన్స్ అన్నీ సెట్స్‌లోనే తీస్తున్నారు వశిష్ట. ప్రభాస్ రాజా సాబ్‌లోనూ అంతే. ఇలా ఈ మధ్య ఏ సినిమా తీసుకున్నా.. పూర్తిగా సెట్స్‌పైనే ఆధారపడుతున్నారు.