Digital Remake: సిల్వర్ స్క్రీన్ లో మాత్రమే కాదు.. డిజిటల్‌లోనూ రీమేక్ ట్రెండ్.. రానున్న డిజిటల్ రీమేక్స్ ఇవే..
సిల్వర్ స్క్రీన్ మీదే కాదు డిజిటల్‌లోనూ రీమేక్ ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది. కోవిడ్ టైమ్‌లో ఇంటర్నేషనల్ కంటెంట్‌కు ఎక్స్‌పోజ్ అయిన ఆడియన్స్.. ఆ రేంజ్ షోస్ మన దగ్గర కూడా కావాలంటున్నారు. అందుకే మన మేకర్స్ ఫారిన్ కథలను మన కల్చర్‌కు తగ్గట్టుగా మార్చి రీమేక్ చేస్తున్నారు. ప్రజెంట్ సినిమాలకు పోటీగా వెబ్ సిరీస్‌లు కూడా ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీని రూల్ చేస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్ మీద చెప్పేందుకు వీలుకానీ కథలను.. ఓటీటీలో కాస్త సుధీర్ఘంగా చెప్పేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. ఈ ట్రెండ్ రీజినల్ లాంగ్వేజెస్‌లోనూ గట్టిగానే కనిపిస్తోంది.